స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `పుష్ప`లో విలన్ గా నటిస్తున్నారు ఫహద్ ఫాజిల్. మలయాళంలో అగ్ర కథానాయకుడిగా వెలుగుతున్న అతడు బన్నీ సినిమాతో టాలీవుడ్ విలన్ గా రంగ ప్రవేశం చేయడం పై ఆయన అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
2018లో జాతీయ అవార్డ్ నటుడిగా గుర్తింపు దక్కడంతో ఫహద్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇంతకుముందు ట్రాన్స్ చిత్రంలో అతడి నటన చూశాక.. అభిమాని కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. జీసస్ పేరుతో ధనార్జనే ధ్యేయంగా ఆటలాడే కార్పొరెట్ పైనే సెటైర్ వేస్తూ తీసిన ట్రాన్స్ సంచలన విజయం సాధించింది. ఆ సినిమా ఆద్యంతం ఫహద్ మెరుపులు మైమరిపించే నటన మ్యాజికల్ అనిపిస్తుంది.
ప్రస్తుతం అతడు మాలిక్ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి రానుంది. ముస్లిమ్ యువకుడు సులేమాన్ పాత్రలో ఫహద్ కనిపించనున్నారు. అతడు ఇందులో రెండు వేర్వేరు అవతారాలతో సర్ ప్రైజ్ చేయబోతున్నారు. ఒక నిమిషం 45 సెకన్ల నిడివి గల ట్రైలర్ లో అతడి సెన్సిటివ్ పెర్ఫామెన్స్ మైమరిపిస్తోంది.
ముస్లిమ్ ప్రయోక్త అయిన అతన్ని చంపడానికి పోలీసులు కుట్ర చేస్తున్నారని తెలిసి కూడా ప్రశాంతంగా.. ఆధ్యాత్మికంగా తన పని తాను చేసుకుపోయే వాడిగా ఆ పాత్ర ఆకర్షిస్తోంది. సులైమాన్ ప్రముఖ రాజకీయ పార్టీకి ప్రచారం చేయడం..సంక్షోభాలను ఎదిరించేలా ఒక జనసమూహానికి నాయకత్వం వహించడం ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. మతం వెనక పాలిటిక్స్ పై సెటైర్ వేస్తున్నారని కూడా అర్థమవుతోంది. మహేష్ నారాయణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Full View