మల్లికా షెరావత్ .. పరిచయం అవసరం లేని పేరు ఇది. చాలా గ్యాప్ తర్వాత డిజిటల్ సిరీస్ తో మరోసారి తన అభిమానుల ముందుకొస్తున్న మల్లిక తన కెరీర్ లో ఎదురైన రకరకాల వ్యవహారాలపై మీడియాతో ముచ్చటించారు.
మర్డర్ లో లిప్ లాక్ లు బెడ్ రూమ్ సన్నివేశాలతో సాహసం చేశానని అయితే వాటి విషయంలో ‘దాదాపు నైతికంగా హత్యకు గురయ్యానని’ వ్యాఖ్యానించడం వేడెక్కిస్తోంది. అప్పట్లో ఆడియెన్ కి అవగాహన సరిగా లేదు. నటీనటులపై ప్రేక్షకుల అవగాహన ఇప్పుడు మారిందని ఆమె అన్నారు.
2003 లో మల్లికా ఖ్వాహిష్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన మలైకా... మరుసటి సంవత్సరం మర్డర్ లో నటించింది. ఆ రెండు చిత్రాలు బోల్డ్ సన్నివేశాలతో పాపులరయ్యాయి. ఆ తర్వాత మల్లికను సెక్స్ సింబల్ గా పిలిచారు.
ఒక ప్రముఖ దినపత్రికతో మల్లికా మాట్లాడుతూ, ..“నేను మర్డర్ (2004) లో నటించినప్పుడు నాపై చిత్రీకరించిన ఆ సన్నివేశాల వల్ల నేను దాదాపు నైతికంగా హత్య చేయబడ్డాను. నేను దిగజారిపోయిన ఆడదానిగా కనిపించాను. ఈ రోజుల్లో నేను అప్పుడు చేసినవి సినిమాల్లో చాలా సాధారణం. ప్రజల అవగాహన మారిపోయింది. సినిమా మారిపోయింది`` ని పోలిక చెప్పారు.
“కానీ ఇప్పుడు గతం గురించి ఆలోచించినప్పుడు 50 - 60 లలో సినిమాలను కొట్టేవి ఏవీ లేవు. ఆడాళ్లకు అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. కానీ మన సినిమాల్లో ఆ అందం పెద్దగా లేదు. విషయం ఉన్న పాత్రను పొందడానికి నేను సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను`` అన్నారు. ఇక తాను పరిశ్రమలో ప్రవేశించిన క్రమంలో తనకు ఎవరూ బోయ్ ఫ్రెండ్ లేరని అందువల్ల అవకాశాలు సరిగా రాలేదని కూడా వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో బోయ్ ఫ్రెండ్ ఉంటే ఛాన్సులొస్తాయని తనకు తెలుసని దానికోసం ఎవరితోనూ స్నేహం చేయలేదని కూడా వెల్లడించారు.
అనురాగ్ బసు దర్శకత్వం వహించిన మర్డర్ లో మల్లికా సిమ్రాన్ పాత్రలో నటించారు. అశ్మిత్ పటేల్ పోషించిన సుధీర్ అనే వర్క్‌హోలిక్ వ్యక్తితో అసంతృప్త వివాహబంధంలో చిక్కుకున్న మహిళ పాత్ర అది. తన మాజీ ప్రేమికుడు సన్నీ(ఎమ్రాన్ హష్మి)తో ఒకానొక బలహీన క్షణం తరువాత.. ఆమె అతనితో ఎఫైర్ ప్రారంభిస్తుంది. అపరాధభావంతో కుంగిపోయిన తరువాత ఆమె ఆ సంబంధానికి ముగింపు పలుకుతుంది. కానీ అతను ఆమెను ఎలాగైనా తిరిగి పొందాలని వెంటాడతాడు..
ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్- ఆప్ కా సురూర్- వెల్ కమ్- డబుల్ ధమాల్ వంటి చిత్రాల్లో కూడా మల్లికా నటించింది. జాకీ చాన్ నటించిన ది మిత్- పాలిటిక్స్ ఆఫ్ లవ్ - టైమ్ రైడర్స్ సహా అంతర్జాతీయ ప్రాజెక్టులలో నూ నటించింది. 2019 లో మల్లికా తన డిజిటల్ అరంగేట్రం ALT బాలాజీ సిరీస్ బూ సబ్కి ఫతేగితో పాటు... తుషార్ కపూర్ తో కలిసి ఆమె వెబ్ సిరీస్‌లో దెయ్యం పాత్ర పోషించింది. ఇందులో క్రుష్ణా అభిషేక్- సంజయ్ మిశ్రా,- కికు శారదా - షెఫాలి జారివాలా కూడా నటించారు.