సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ లో పలువురు ఈమద్య కాలంలో జాతీయ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తెలుగు స్టార్ హీరో ప్రభాస్ తర్వాత మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంటున్నాడు. ఏక కాలంలో పది నుండి పదిహేను సినిమా ల్లో నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్న ఘనత కేవలం పృథ్వీరాజ్ కు మాత్రమే దక్కింది.
నటుడిగా ఎంత బిజీగా ఉన్నా కూడా దర్శకుడిగా తన ప్రతిభను చూపించేందుకు లూసీఫర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మలయాళం లోనే కాకుండా అన్ని భాషల్లో కూడా నచ్చింది. అందుకే ఇప్పుడు గాడ్ ఫాదర్ అంటూ తెలుగు లో చిరంజీవి రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. లూసిఫర్ మాత్రమే కాకుండా ఇంకా పలు మలయాళ సినిమాలకు దర్శకత్వం వహించాడు.
హీరోగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీ బిజీగా ఉన్న పృథ్వీ రాజ్ తాజాగా నటించిన కడువా సినిమాను తెలుగు లో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. కడువా తెలుగు వెర్షన్ ప్రమోషన్ కోసం హైదరాబాద్ కు పృథ్వీరాజ్ సుకుమారన్ మొదటి సారి వచ్చాడు. తన సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన పృథ్వీరాజ్ తెలుగు సినిమాలపై తన అభిప్రాయంను వెళ్లడించాడు.
తెలుగు సినిమాల్లో నటించాలని తాను భావిస్తున్నాను అన్నాడు. ఇప్పటికే సలార్ సినిమా లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నట్లుగా పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. కేవలం తెలుగు లో నటించడం మాత్రమే కాకుండా తెలుగులో ఒక సినిమా ను తెరకెక్కించాలని భావిస్తున్నట్లుగా కూడా చెప్పుకొచ్చాడు.
టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఇటీవలే తనకు తెలుగు సినిమా ఆఫర్ ను ఇచ్చిందని.. తెలుగు లో దర్శకత్వం చేయాలనే కోరిక ఉంది.. కాని కాస్త సమయం పడుతుందని అన్నాడు. త్వరలోనే తెలుగు లో నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వం వహిస్తాను అన్నట్లుగా పృథ్వీరాజ్ ప్రకటించాడు.
ఈమద్య కాలంలో తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు దర్శకులు తెలుగు లో సినిమా లు చేస్తున్నారు. అదే దారిలో తెలుగు మార్కెట్ నేపథ్యంలో ఇక్కడ సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నారు. తెలుగు లో కమర్షియల్ సినిమాలకు బ్రహ్మరథం పడతారు. అందుకే ఇక్కడ సినిమాలు చేయాలని ఇతర భాషల దర్శకులు భావిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు లో సినిమా తో సక్సెస్ అయ్యేనా చూడాలి.