నిన్నా మొన్నటి దాకా ఊహాగానాల్లోనే షికారు చేస్తున్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గురించి అఫీషియల్ అప్ డేట్ స్వయంగా దర్శకుడు మహి రాఘవ ఇవ్వడంతో హీరో ఎవరు అనే దానికి అధికారికంగా చెక్ పడింది. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టినే వైఎస్ పాత్రలో కనిపించబోతున్నట్టు మహి రాఘవ చెప్పడంతో సస్పెన్స్ కు తెర వీడింది. నాగార్జున చేసే అవకాశాలు ఉన్నాయంటూ కొద్ది రోజులు వార్తలు ప్రచారమయ్యాయి కాని మొత్తానికి మమ్ముట్టి ఫైనల్ కావడం పట్ల అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1992లో వచ్చిన స్వాతి కిరణం, 1996లో వచ్చిన సూర్య పుత్రులు తర్వాత మమ్ముట్టి మరే తెలుగు స్ట్రెయిట్ సినిమాలో నటించలేదు. డబ్బింగ్ రూపంలో మనకు సుపరిచితుడే కాని అక్కడున్న కమిట్ మెంట్స్ వల్ల మళ్ళి తెలుగులో చేసే అవకాశం దక్కలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ పాత్ర ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను మమ్ముట్టి నేరుగా పలకరించనున్నాడు.
వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో కీలక ప్రస్థానంగా నిలిచి ఆయన ప్రజల నేతగా నిలిచిపోవడానికి బాటలు వేసిన పాదయాత్రకు గుర్తుగా ఈ సినిమా పేరు ‘యాత్ర’ అని ఫిక్స్ చేయబోతునట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇది కూడా ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే తాను మమ్ముట్టిని కలిసి డేట్స్ విషయం నిర్ధారించుకుని షూటింగ్ ప్రారంభం గురించి ప్లాన్ చేసుకుంటాను అంటున్నాడు మహి రాఘవ. మమ్ముట్టి కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి మిగిలిన పాత్రలకు ఎవరిని తీసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తానని నయనతార, సూర్యలను తీసుకోవడం గురించిన వార్తలను ప్రస్తుతానికి ఖండించారు.అసలు వాళ్ళను కలవలేదు అంటున్నాడు. ఎన్టీఆర్, సావిత్రి బయోపిక్ లు రూపొందుతున్న సమయంలోనే వైఎస్ ఆర్ ది కూడా తెరమీదకు రావడం కాకతాళీయమే అయినా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కు శ్రీకారం పడిందని చెప్పొచ్చు .