నిన్నటి రోజున మన యువాస్టార్లంతా చెన్నయ్ వరదబాధితుల సహాయార్థం ఓ చక్కని కార్యక్రమాన్ని చేపట్టారు. కూకట్ పల్లి మంజీరా మాల్‌కి వెళ్లి జనాల నుంచి సాయం కోరారు. మన మద్రాసు కోసం అంటూ చేపట్టిన ఈ సేవా కార్యక్రమానికి బోలెడంత రెస్పాన్స్ వచ్చింది. జనాలంతా రకరకాల తిండి పదార్థాలు, ఇతరత్రా సమాగ్రిని తీసుకొచ్చి డొనేట్ చేశారు. బిస్కెట్ ప్యాకెట్లు, పాత దుస్తులు.. ఇతరత్రా అన్నీ తెచ్చి ఇచ్చారిక్కడ. అంతేనా పనిలో పనిగా తమ అభిమాన తారల్ని దగ్గరగా చూసుకోవాలని తెగ ఆత్ర పడ్డారు.
అక్కడితో ఆగక సెక్యూరిటీ కంట్రోల్ లేకపోవడంతో మీది మీదికి వెళ్లిపోయారు. దాంతో భయపడిపోయిన లక్ష్మి ప్రసన్న - మధుశాలిని - కాజల్ - తేజస్వి లాంటి తారలు హుఠా హుటీన అక్కణ్ణుంచి పలాయనం చిత్తగించారు. ఏదైతేనేం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. జనాలు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ ప్రయత్నం ఫలించింది.. కాబట్టి ఇలాంటివి మరిన్ని చేస్తే బావుంటుందని, చెన్నయ్ వాసుల్ని ఆదుకునేందుకు అవసరమైన సామాగ్రిని కలెక్ట్ చేసి అక్కడికి పంపిస్తే బావుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. నిన్నటిరోజున కలెక్ట్ చేసిన గూడ్స్ మొత్తం మొదట రామానాయుడు స్టూడియోకి తరలించి అక్కడి నుంచి నేరుగా చెన్నయ్ పంపించే ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమాలలో రానా ఎంతో యాక్టివ్ గా పాల్గొని అందరి మనసు దోచారు. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ఈ మంచి పనికి ముందుకొచ్చిందంటే రానా తీసుకున్న చొరవతోనే.