మంచి కథ కథనం క్రియేటివిటీ ఉంటే పరిమిత బడ్జెట్లోనే సినిమాలు తీసి లాభాలు ఘడించవచ్చని నిరూపిస్తున్నారు ఫిలింమేకర్ మారుతి. డిస్ట్రిబ్యూటర్ గా దర్శకనిర్మాతగా అతడికి ఉన్న బహుముఖ ప్రజ్ఞ ఇప్పుడు ఓ చిన్న సినిమాని సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లింది.
ఈ చిన్న సినిమా నిజంగా ఫార్ములా ప్రకారం తెరకెక్కి గారడీ చేసిందన్న పాజిటివ్ బజ్ ని తేవడంలో మారుతి మరోసారి సఫలమయ్యారు. ఇదంతా ఏ మూవీ గురించి అంటే ఇటీవలే థియేటర్లలో రిలీజైన మంచి రోజులు వచ్చాయి సినిమా గురించే. సంతోష్ శోభన్ - మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమాకి రిలీజ్ ముందే లాభాలొచ్చాయి.
కేవలం ఒక నెల వ్యవథిలోనే షూటింగ్ ను పూర్తి చేయడంతో తక్కువ బడ్జెట్లో సినిమాని తీయగలిగారు. దీనికి ఆహా -తెలుగు డిజిటల్ హక్కులను దక్కించుకోగా... స్టార్ నెట్ వర్క్ విడుదలకు ముందే శాటిలైట్ హక్కులను పొందింది. ఆ రకంగా నిర్మాతలు నాన్ థియేట్రికల్ హక్కులను విక్రయించడం ద్వారా మొత్తం పెట్టుబడిని తిరిగి పొందారు. ఇక సొంత పంపిణీ వ్యవస్థ ద్వారా సినిమాని రిలీజ్ చేసి లాభాల్ని ఆర్జిస్తున్నారు. థియేట్రికల్ రన్ లో వచ్చేదంతా లాభం గానే భావిస్తున్నారు. పెద్ద హీరోలతో ఆఫర్లు ఉన్నా మారుతి తన జానర్ ని విడిచిపెట్టకుండా తెలివైన గేమ్ ప్లేయర్ గా కొనసాగుతున్నారు అనడానికి ఈ సినిమా విజయం ఒక ఎగ్జాంపుల్. ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా మారిన మారుతి పరిమిత బడ్జెట్ చిత్రాల్లో తనదైన మార్క్ తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.