`భలే భలే మగాడివోయ్` లాంటి క్లాసిక్ కామెడీ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించారు మారుతి. ప్రేమకథా చిత్రం లాంటి హారర్ సినిమాని.. భలే మహానుభావుడు లాంటి కాన్సెప్ట్ బేస్డ్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించాడు. మారుతి తనకంటూ ఒక బ్రాండ్ ఉందని నిరూపించారు.
ఇప్పుడు యంగ్ హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా `మంచి రోజులు వచ్చాయి` సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా కథానాయిక. వి.సెల్యులాయిడ్- ఎస్.కె.ఎన్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాలనీ సెటప్ లో కేవలం 30రోజుల్లో తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన సోసోగా ఉన్నాననీ లిరికల్ వీడియో ఆకట్టుకంది. తాజాగా మంచిరోజులొచ్చాయి ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్ ఆద్యంతం మెహ్రీన్ తో సంతోష్ రొమాన్స్ ఆకట్టుకుంది. ఇక మెహ్రీన్ తండ్రి కూతురిపై ఇన్వెస్టిగేషన్ కథాకమామీషు బోలెడంత ఫన్ ని క్రియేట్ చేస్తోంది. కాలనీలో కూతురి వెంట పడే కొలీగ్ కథేంటో కానీ యువతరానికి కిక్కిచ్చే లవ్ రొమాంటిక్ ఎపిసోడ్లకు కొదవేమీ లేదు. మారుతి బ్రాండ్ రొమాన్స్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. సిట్యుయేషనల్ కామెడీని వర్కవుట్ చేయడంలో మారుతి ప్రతిభను సందేహించాల్సిన పని లేదు. మంచి రోజులు వచ్చాయి లో అది వర్కవుటవుతుందనే భావిద్దాం. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.
Full View