యూకే లోను.. అమెరికాలోను అక్టోబర్ 31 సాయంత్రం హాలోవీన్ ఈవెనింగ్ గా జరుపుకోవడం ఆనవాయితీ. చిన్నా పెద్దా.. ముసలీ ముతకా దెయ్యాలు భూతాలు టైపులో మేకప్ వేసేసుకుని సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటారు. ఒక్క అమెరికాలోనే ఈ హాలోవీన్ డే కోసం 10 బిలియన్ డాలర్లు అంటే 70వేల కోట్ల రూపాయల వ్యాపారం(హాలోవీన్ సంబంధిత ఉత్పత్తులపైనే) జరుగుతుందంటే.. ఇది ఎంత ఇంపార్టెంట్ ఈవెంట్ అర్ధం చేసుకోవచ్చు.
మంచు విష్ణు తను నిర్వహిస్తున్న న్యూయార్క్ అకాడమీ - ప్రోగ్రెసివ్ అమెరికన్ స్కూల్ విద్యార్ధులతో ఈ హాలోవీన్ డే రోజు సాయంత్రం.. ఓ పెద్ద పార్టీ సెలబ్రేట్ చేశాడు. ఈ కార్యక్రమంలో ఆ స్కూల్ కు చెందిన పలువురు చిన్నారులు హాలోవీన్ గెటప్స్ తో సందడి చేశారు. ఇది పూర్తిగా అమెరికన్ కరిక్యులంతో నిర్వహిస్తున్న స్కూల్. అక్కడి ఆచారాలను వ్యవహారాలను కంప్లీట్ గా పాటించేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే.. అమెరికాలో ఉన్న స్కూల్ లో చదువుకుంటే ఎలా ఉంటుందో.. సేమ్ డిట్టో అన్న మాట.
అందుకే కిడ్స్ సెంటర్ లో ఈ హాలోవీన్ పార్టీ జరిగింది. దీనికి మంచు మనోజ్ కూడా హాలోవీన్ గెటప్ లోనే హాజరు కావడం అందరినీ ఆకట్టుకుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/