సోషల్ మీడియాలో మెగా - మంచు అభిమానుల మధ్య తరచుగా మాటల యుద్ధం జరుగుతుందనే సంగతి తెలిసిందే. రెండు ఫ్యామిలీలు సన్నిహితంగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ.. మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత పరిస్థితులు మెగా వెర్సెస్ మంచు అనే విధంగా తయారయ్యాయి. అప్పటి నుంచీ ఎప్పుడూ ఏదొక విషయంపై ఇరు వర్గాలు ట్రోలింగ్ చేసుకుంటూ వస్తున్నారు.
రెండు నెలల క్రితం విడుదలైన కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటించిన ''సన్ ఆఫ్ ఇండియా'' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. టాక్ ఎలా ఉన్నా ఓ మోస్తరు కలెక్షన్స్ వస్తాయని భావించగా.. ఓపెనింగ్స్ రాకపోగా నెగిటివ్ షేర్ తో షాక్ ఇచ్చింది. ఆ టైంలో ఈ సినిమాపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. అయితే దీని వెనుక ఉంది మెగా అభిమానులే అని మంచు వారు బలంగా నమ్మారు. ఈ ట్రోలింగ్ మీద ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు.
'సన్ ఆఫ్ ఇండియా' మూవీ రిలీజ్ కు ముందు నుంచీ మంచు ఫ్యామిలీ మీద వచ్చిన ట్రోల్స్ కారణంగానే సినిమా ఆడలేదని స్టేట్ మంచు యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నారు. వందకు పైగా యూట్యూబ్ చానెల్స్ పనిగట్టుకొని మరీ మంచు ఫ్యామిలీపై సినిమాపై నెగిటివ్ ప్రచారం చేశాయని.. అదే ఇంపాక్ట్ చూపెట్టిందని ఆరోపించారు. అయితే ఇప్పుడు మంచు మద్దతుదారులకి మెగా అభిమానుల మీద రివేంజ్ తీర్చుకునే అవకాశం వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా తొలి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుని.. ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ఫస్ట్ డే వసూళ్ళు బాగానే ఉన్నా.. రెండో రోజు షేర్ సింగిల్ డిజిట్ కి పడిపోయింది. అది మూడో రోజు కోటికి.. నాలుగో రోజుకు లక్షల్లోకి వచ్చేసింది. ఐదో రోజుకు థియేటర్ వైపు వెళ్లే జనాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.
కలెక్షన్స్ తగ్గుతాయని అనుకున్నారు కానీ.. మెగా తండ్రీకొడుకుల నుంచి ఈ రేంజ్ డిజాస్టర్ ని ఎవరూ ఊహించలేదు. ఫైనల్ రన్ పూర్తయ్యే నాటికి కొన్ని కోట్ల నష్టం తప్పవని ఓ అంచనా వచ్చేసింది. దీంతో ఇప్పుడు మంచు ఫ్యామిలీ మద్దతుదారులు - అభిమానులు రంగంలోకి దిగారు. 'ఆచార్య' సినిమా పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.
'సన్నాఫ్ ఇండియా' టైంలో బుకింగ్స్ స్క్రీన్ షాట్స్ తీసి ఎలా అయితే ట్రోల్ చేశారో.. ఇప్పుడు 'ఆచార్య' అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. వీరికి ఇతర యాంటీ మెగా ఫ్యాన్స్ గ్రూప్ కూడా జత కలుస్తున్నారు. అందరూ కలిసి మెగా మూవీపై నెగెటివ్ ట్వీట్స్ తో కౌంటర్లు వేస్తున్నారు.
ఇకపోతే 'ఆచార్య' ప్రీమియర్స్ టాక్ వచ్చిన వెంటనే మంచు విష్ణు చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. “డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. ఒళ్లంతా నొప్పులుగా ఉన్నాయి” అంటూ ఉదయం 5 గంటలకు ట్వీట్ చేశారు విష్ణు. దీని వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటో తెలియదు కానీ.. నెటిజన్స్ మాత్రం 'ఆచార్య' సినిమా రిజల్ట్ తో ముడి పెడుతూ కామెంట్స్ పెట్టారు.
ఒళ్ళు నెప్పులు రాకుండా డ్యాన్స్ నేర్పే ఆచార్య ని పెట్టుకో అంటూ సలహాలు ఇచ్చారు. మొత్తం మీద విష్ణు ట్వీట్ పరోక్షంగా మెగా మూవీని ఉద్దేశిస్తూ చేసిందే అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన 'గని' సినిమా రిలీజ్ సందర్భంగా విష్ణు విషెస్ చెప్పడం పై మెగా ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్స్ పెట్టిన సంగతి తెలిసిందే.