ఇటు జగపతి.. అటు లక్ష్మి మంచు

Update: 2015-06-26 19:51 GMT
62వ ఫిలింఫేర్‌ అవార్డుల్లో అసలు బెస్ట్‌ యాక్టర్‌, బెస్ట్‌ యాక్ట్రెస్‌ అవార్డుల కంటే కూడా.. బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్లపైనే ఈసారి ఎక్కువమంది ఆసక్తిగా చూశారంటే అందులో అతిశయోక్తి లేదేమో. ఎందుకంటే ఉద్దండులు కొంతమంది ఈసారి కాస్త గట్టిగానే పోటీపడ్డారు.

బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌.. మేల్‌.. క్యాటగిరిలో గోవిందుడు అందరివాడేలే సినిమాకు గాను ప్రకాష్‌రాజ్‌కు అవార్డు వస్తుందా లేకపోతే దిక్కులు చూడకురామయ్య సినిమాకు అజయ్‌కు వస్తుందా అని జనాలు ఎక్కువగా పందేలా కూడా వేశారట. అయితే హీరో నుండి విలన్‌గా మారిన జగపతి బాబుకే ఎక్కువమంది ఓటేశారు. దానిలతో లెజండ్‌లో మనోడు చేసిన జితేంద్ర పాత్రకుగా ''బెస్ట్‌ బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌.. మేల్‌'' అవార్డును అందుకున్నాడు.

మరి ఫిమేల్స్‌ సంగేతేంటి? మనం సినిమాలో నత్తి ఉన్న పిల్లగా శ్రీయ రోల్‌ అదిరిపోయింది. అలాగే బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళిగా కార్తిక కూడా బాగానే అలరించింది. మరి దృశ్యంలో నదియా? రౌడీ సినిమాలో జయసుధ? వీళ్లందరూ ఏమోగాని క్రేజ్‌ తగ్గిపోయిన మోడల్‌గా చందమామ కథలు సినిమాలో లక్ష్మి మంచు నటన కేక.. అందుకే ఆమెనే బ్లాక్‌ లేడీ వరించింది. కంగ్రాట్స్‌ గయ్స్‌.

Tags:    

Similar News