మంచు లక్ష్మి తన తండ్రి మోహన్ బాబులాగే డేరింగ్ అండ్ డాషింగ్. ఎవ్వరికీ భయపడరు. తన మనసుకు ఏదనిపిస్తే అది నిర్భయంగా చెప్పేస్తుంటారు. అయితే మోహన్ బాబు కూతురైన తనని ఎవరు మోసం చేస్తార్లే అని చాలా మంది భావిస్తుంటారని - కానీ తాను చాలామంది చేతుల్లో మోసపోయానని ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. లక్ష్మీని మోసం చేసింది ఎవరా అని అంతా ఆరా తీసే పనిలో ఉన్నారిప్పుడు. అయితే తాను ఎంతగా మోసపోయినా - సినిమాలతో ఎంత డబ్బు పోగొట్టుకొన్నా ఇప్పటికీ ఎవ్వరికీ పైసా కూడా ఇవ్వకుండా ఆపలేదని ఆమె చెప్పుకొచ్చారు.
ఇటీవలే ఆమె నటించి నిర్మించిన వైఫ్ ఆఫ్ రామ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో మంచు లక్ష్మి సంచలనమైన కామెంట్లు చేస్తోంది. మొన్నటికి మొన్న తెలుగులో ఆదరించడం లేదని - అందుకే తాను తమిళంలోకి షిఫ్ట్ అవుతానని ప్రకటించింది. అంతటితో ఆగకుండా తాజాగా తనకి డబ్బు ఎగ్గొట్టిన ఓ నిర్మాత బండారాన్ని బయటపెట్టింది. ``నేను తీసిన `గుండెల్లో గోదారి` సినిమాకి సంబందించిన అప్పులు ఇప్పటికీ కట్టుకుంటూ ఉన్నా. కానీ ఒక నిర్మాత మాత్ర తనకి ఇవ్వాల్సి 23 లక్షలు ఎగ్గొట్టి వేరొకరి పేర్లతో సినిమాలు తీస్తున్నాడు`` అని ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు లక్ష్మి. ఆ కామెంట్ ఇండస్ట్రీలో మరోమారు చర్చను లేవనెత్తుతోంది. బెల్లంకొండపైనే లక్ష్మి ఆరోపణలు చేసిందని కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. `ఊ కొడతారా ఉలిక్కి పడతారా` కోసం వేసిన సెట్లో బెల్లంకొండ రభస సినిమా షూటింగ్ జరిపాడు. దాని రెంట్ కి సంబంధించి లక్ష్మికి డబ్బు రావల్సి ఉందట. దాని గురించి అప్పట్లో వివాదం కూడా నడిచింది. ఆ తర్వాత సెటిల్ అయిందనుకొన్నారు కానీ... లక్ష్మి మరోమారు తనకి డబ్బు ఎగ్గొట్టారనే మాటని చెప్పడంతో అందరూ అప్పట్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకుంటున్నారు.