కోటి విద్యలు కూటి కొరకే అనేది పూర్తిగా వాస్తవం. ఈ విషయం కడుపునిండిన వాడికంటే.. ఆకలితో ఉన్నవాడికే బాగా నచ్చుతుంది. ఎవరు ఎన్ని తిప్పలుపడినా - ఎన్ని కోట్లు సంపాదించినా తినేది ఆ నాలుగు మెతుకులే - ఆ నాలుగు ముద్దలకోసమే ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని పాట్లు పడినా. ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించారు మంచు లక్ష్మి. ఆమెకు భోజనంపై ఉన్న శ్రద్ధ - ఆసక్తి.. అది సమయానికి అందకపోతే ఆమెలో బయటకువచ్చే రెండో కోణం గురించి చెప్పుకొస్తున్నారు. "లక్ష్మీ టాక్ షో" తో తెలుగువారికి పూర్తిగా పరిచయం అయిన మంచు లక్ష్మి.. తర్వాతి కాలంలో సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.
"కోటి విద్యాలూ కూటి కోసమే.. మా ఇంట్లో అందరమూ భోజన ప్రియులమే.. సమయానికి తిండి పడకపోతే ప్రళయం వచ్చేస్తుంది.. నేనైతే విడాకుల వరకూ వెళ్లిపోతా.. ఈ విషయంలో మా ఆయనతో చాలా గొడవలే జరిగాయి" అని చెబుతున్నారు మంచు లక్ష్మి. ఫుడ్ విషయంలో తన భర్తతో చాలా సార్లు గొడవలు కూడా పడినట్లు ఆమె చెబుతున్నారు. ఒకసారి ఆమె భర్తకు... "నేను ఆకలిగా ఉన్నపుడు అన్న మాటలన్ని.. ఉద్దేశపూర్వకంగా అన్నవి కావు... సారీ" అని ఇంగ్లిష్ కొటేషన్స్ ఉన్న పోస్టర్ రూపంలో ప్రజెంట్ చేస్తే.. "బాగా" చెప్పావు అని మెచ్చుకున్నరట కూడా! ఈ రేంజ్ లో భోజనం విషయంలో తాను ఎంత శ్రద్ధగా, ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో చెప్పుకొచ్చారు లక్ష్మి.
ఇక తాను అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లోనే టీవీషోలు చేయడం, అనంతరం తెలుగు సినిమా పరిశ్రమ వైపు రావడం పై కూడా లక్ష్మి తన అనుభవాలను పంచుకున్నారు. అప్పటివరకూ అమెరికాలోనే ఉండే లక్ష్మి.. తన పెద్ద తమ్ముడు విష్ణు పెళ్లికోసం ఇండియాకు రావడం, ఆ సమయంలో తనకు "ఓఫ్రా విన్ ఫ్రే టాక్" వంటిది చేయాలని అనడం, ఆ మాటలు జీటీవీకి చెందిన సంజయ్ వినడం.. ఆయన విష్ణుతో మాట్లాడటం చక చకా జరిగిపోయాయట. దాని ఫలితమే "లక్ష్మీ టాక్ షో" అని చెప్పారు. ఆ టాక్ షో తర్వాత తెలుగు వారికి పూర్తిగా పరిచయం - దగ్గర అయిన లక్ష్మీ వరుసగా సినిమాలు చేయడం - వేరే వేరే షోలు కూడా చేయడం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా లక్ష్మీ చేస్తున్న "మేము సైతం" కార్యక్రమానికి అత్యధిక అభినందనలు వస్తున్నాయి. మొదట్లో ఆరు నెలలు అమెరికాలో.. ఆరు నెలలిక్కడ ఉండే లక్ష్మీ - ఇప్పుడు అమెరికా వెళ్లి దాదాపు ఏడాదిన్నర దాటిపోతోందని చెబుతూ, ఎంత బిజీ అయిపోయారో చెప్పకనే చెప్పారు.