కొన్ని విమానయాన సంస్థల పై కొంతకాలంగా ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తోన్న సంగతి తెలిసిందే. రకరకాల కారణాలతో పలు సంస్థలు...వివాదాల్లో నిలుస్తున్నాయి. ఇండిగో సిబ్బంది....పలువురుని ఇబ్బంది పెట్టడంతో వార్తల్లో నిలిచింది. ఇక, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై కూడా గతంలో కొన్ని ఫిర్యాదులున్నాయి. తాజాగా, ఎయిర్ ఇండియా పై నటి మంచు లక్ష్మీ మండిపడింది. అసలు కారణమేంటో చెప్పకుండా 4 గంటల పాటు తనను క్యూలైన్ లో నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనతో పాటు మిగతా ప్రయాణికులను ఎయిర్ ఇండియా అధికారులు పట్టించుకోలేదని దుయ్యబట్టింది. ఆ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంతో ఆహారం, నీళ్లు లేకుండా పలువురు ప్రయాణికులు పుణె ఎయిర్ పోర్టులో చిక్కుకున్నారని తెలుపుతూ ట్వీట్ చేసింది.
బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరాల్సి ఉందని లక్ష్మి ట్వీట్ చేసింది. కానీ, సాయంత్రం నాలుగు గంటలైనా విమానం రాలేదని తెలపింది. ప్రయాణికులంతా గట్టిగా నిలదీసినా అక్కడి ఎయిర్ ఇండియా అధికారి జవాబు చెప్పలేదని ఆరోపించింది. వీళ్లతో లాభం లేదనుకొని హైదరాబాద్ కు ఫోన్ చేస్తే వాతావరణం బాగోలేదని, అందుకే విమానం రద్దయిందని చెప్పారని ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని పుణె సిబ్బంది ముందే చెప్పి ఉండవచ్చని, కానీ ప్రయాణికులను అంత టార్చర్ పెట్టడంలో ఎయిర్ ఇండియాకు అంత ఆనందం ఎందుకోనని లక్ష్మీ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.