మంచు మోహన్ బాబు నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన కూతురు మంచు లక్ష్మీ తాజాగా నెటిజన్లపై విరుచుకుపడ్డారు. ఇంటర్నెట్ లో తనను - తన కుటుంబాన్ని ట్రోల్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫ్ ఆఫ్ రామ్ చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న మంచు లక్ష్మీ మాట్లాడిన మాటలు సంచలనమయ్యాయి.
మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో తనపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. వాటిలో కొన్నింటిని ఎంజాయ్ చేస్తుంటా.. కానీ నా వ్యక్తిగత జీవితానికి - ప్రతిష్టకు భంగం కలిగించే.. నా కుటుంబ పరువు తీసే వాటిని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఊరుకునేది లేదు’ అని ఫైర్ అయ్యారు. నన్ను - నా కుటుంబాన్ని టార్గెట్ చేసి యూట్యూబ్ లో ఫోటోలు - వీడియోలు పెట్టి మార్ఫింగ్ చేసే వాళ్లను చెప్పుతో కొట్టాలనిపిస్తోంది అని ఫైర్ అయ్యింది. ‘దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి రా.. నా గురించి.. నా ఇంటిసభ్యుల గురించి ఎవడికి ఏం తెలుసు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
‘నా ఫ్యామిలీపై బురద జల్లే విధంగా తప్పుడు కథనాలు వస్తే సింహంలా మారుతాను.. వారిని చంపేయాలనిపిస్తోంది. వారిపై ఏమాత్రం పశ్చాత్తాపం పడను. చవకబారు వ్యాఖ్యలకు ఓ హద్దు ఉంటుంది’ అంటూ మంచు లక్ష్మీ హెచ్చరికలు జారీ చేశారు.
ఒకరిని తప్పు పట్టే హక్కు వేరొకరి లేదంటూ మంచు లక్ష్మీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాతో కొన్ని లాభాలు - నష్టాలున్నాయని.. వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువగా భంగం కలుతున్నదని వాపోయారు. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడాలనే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అందరిలాగానే మా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామని మంచు లక్ష్మీ తెలిపారు.