గత ఏడాది మంచు మనోజ్.. శౌర్య.. ఎటాక్ సినిమాలతో గట్టి ఎదురు దెబ్బలే తిన్నాడు. ‘ఎటాక్’ కంటే కూడా ‘శౌర్య’ ఫలితం మనోజ్ ను ఎక్కువ బాధపెట్టింది. ఎందుకంటే తన శైలికి భిన్నంగా చేసిన ఈ చిత్రం మంచి ఫలితాన్నిస్తుందని.. భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రయత్నాలు చేద్దామని అనుకున్నాడు మనోజ్. కానీ ఆ ప్రయోగం దారుణంగా బెడిసికొట్టింది. ఈ సినిమాకు సంబంధించి అమెరికాలో మనోజ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ చిత్రానికి ప్రిమియర్స్ ప్లాన్ చేస్తే జనాలు రాలేదని షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘కరెంటు’ తీగ లాంటి హిట్టు తర్వాత తన సినిమాకు ఇలాంటి అనుభవం ఎదురవుతుందని మనోజ్ అస్సలు ఊహించలేదు.
ఐతే ‘గుంటూరోడు’ మీద కొంచెం పాజిటివ్ బజ్ ఉండటంతో ఈసారైనా పరిస్థితి మారుతుందని ఆశించాడు మనోజ్. ఐతే ఈ చిత్రానికి ప్రిమియర్స్ వేయగా.. పరిస్థితి పెద్దగా మారలేదు. ప్రిమియర్ షోలతో ఈ చిత్రం కేవలం వెయ్యి డాలర్లకు కొంచెం ఎక్కువగా వసూలు చేసిందంతే. మనోజ్ లాంటి ఇమేజ్ ఉన్న హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం అనూహ్యమే. అదే సమయంలో ‘గుంటూరోడు’కు పోటీగా రిలీజైన రెండు సినిమాలు చాలా బెటర్ గా పెర్ఫామ్ చేశాయి. రాజ్ తరుణ్ సినిమా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ 7 వేల డాలర్లకు పైగా వసూలు చేస్తే.. ‘పెళ్లిచూపులు’తో మిలియన్ డాలర్ క్లబ్బులోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ నటించిన ‘ద్వారక’ అన్నిటికంటే మెరుగ్గా 11 వేల డాలర్లకు పైగా వసూలు చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/