ప్రతి ఎన్నికల సమయంలో వచ్చి హడావుడి చేసే కేఏపాల్ మరోసారి మీడియా ముందు హల్ చల్ చేస్తున్నాడు. త్వరలో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధికారం దక్కించుకోవడం ఖాయమంటూ ధీమాగా చెబుతున్నాడు. తన పార్టీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్దిని కూడా ఏకరువు పెడుతున్నాడు. ఈ సమయంలోనే వర్మ పై పాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకానొక సమయంలో వర్మ తన పాదాలను మొక్కాడని - ఆయనకు తాను ఆశీర్వాదం ఇచ్చానంటూ చెప్పుకొచ్చాడు. తనను వివాదంలోకి లాగినందుకు గాను వర్మ అదే స్థాయిలో రివేంజ్ తీర్చుకునేందుకు సిద్దమయ్యాడు.
పాల్ ఒక ఇంటర్వ్యూలో పాడిన ఒక పాటను తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. పాల్ పాట తెగ నవ్వులు పూయిస్తుంది. వర్మ ఆ పాటను షేర్ చేయడంతో మరింతగా వైరల్ అయ్యింది. తాజాగా ఆ పాటపై మంచు హీరో మనోజ్ కూడా స్పందించాడు. ట్విట్టర్ లో మంచు మనోజ్ స్పందిస్తూ... సర్ - ఇది ఛారిత్రాత్మక వీడియో ఇది - నేను ఈ పాటను పాడేందుకు చాలా ప్రయత్నించాను - కాని నా వల్ల కాలేదు. ప్రపంచంలోనే గొప్ప పాట అన్నట్లుగా మనోజ్ పాల్ పాటపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను సంధించాడు.
అమితా బచ్చన్ ను ప్రాణాపాయం నుండి కాపాడానని - ట్రంప్ ను నేనే గెలిపించానని - 15కు పైగా యుద్దాలను ఆపానంటూ చెబుతున్న పాల్ ను వర్మ ఒక జోకర్ గా అభివర్ణించాడు. ఆ జోకర్ తల సరి అవుతుందనే ఉద్దేశ్యంతో ఆయన కాళ్లు పట్టి లాగేందుకు కాళ్లు పట్టుకున్నానంటూ వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి వర్మ ఓ రేంజ్ లో పాల్ పై కామెంట్స్ చేస్తూ పాల్ ను మరింతగా జనాల్లో పలుచన చేస్తున్నాడు.