మంచు మనోజ్ ఎప్పుడూ కొంచెం బొద్దుగానే ఉంటాడు. ఈ మధ్య అయితే మరీ లావెక్కిపోయాడు. ఇలా తయారయ్యారేంటి అని ‘గుంటూరోడు’ ప్రమోషన్ల టైంలో అడిగితే.. ఈ అవతారం ఎందుకో మేలో తెలుస్తుంది అన్నాడు. ఆ నెలలోనే మనోజ్ కొత్త సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో మనోజ్ ఎల్టీటీటీ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రభాకరన్ పాత్ర కోసమే మనోజ్ అంత లావయ్యాడట. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా తీసిన ఒకట్రెండు ఫొటోల్లో మనోజ్ అవతారం ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయమైంది. ఐతే అఫీషియల్ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.
ఈ లుక్ లో ఒక ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఇది చాలా సీరియస్ సినమా అన్న భావన కలుగుతోంది. ఎల్టీటీఈ డ్రెస్.. దాని మీద బుల్లెట్ బెల్ట్.. చేతిలో గన్.. రణరంగంలో దూసుకెళ్తున్నట్లు ఫెరోషియస్ లుక్.. మొత్తంగా మనోజ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ పాత్ర కోసం మనోజ్ గడ్డం కూడా పెంచాడు. తమిళంలో ఒకట్రెండు సినిమాలు తీసిన తెలుగు యువ దర్శకుడు అజయ్ ఆండ్రూస్ ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రంలో మనోజ్.. ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అతను స్టూడెంట్ లీడర్ గానూ మరో క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం. 90ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రం మేలో ప్రేక్షకుల ముందుకొస్తుంది.