మంచు మోహన్ బాబు ఇప్పుడు చాలా సెలక్టివ్ గా ఉంటున్నారు. గతంలో చూపినంత స్పీడ్ చూపించడం లేదు కానీ.. సినిమాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. అల్లరి నరేష్ 50వ సినిమా మామ మంచు అల్లుడు కంచు తర్వాత.. మళ్లీ ఇప్పుడు ఓ సినిమాకి సైన్ చేశారు విలక్షణ నటుడు మోహన్ బాబు.
సేనాపతి అనే టైటిల్ పై రూపొందనున్న మూవీలో మోహన్ బాబు నటించనుండగా.. ఇందులో ఆయన లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణుతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఆయన.. రీసెంట్ గా మరో సినిమా చేసేందుకు కూడా ఒప్పుకున్నారు. అందులో మోహన్ బాబు మరో కుమారుడు మంచు మనోజ్ హీరోగా నటిస్తుండడం విశేషం. ఈ రెండు సినిమాలు మోహన్ బాబు నటనా కౌశలాన్ని చూపించనున్నాయి. ఈ సేనాపతి మూవీని మోహన్ బాబు సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పైనే రూపొందించనుండగా.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మంచు విష్ణు స్క్రిప్ట్ నుంచి అన్ని పనులను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా.. త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. తాజాగా సైన్ చేసిన రెండు సినిమాలతో మోహన్ బాబు తన ఇద్దరు కుమారులను హిట్ ట్రాక్ పట్టించాలనే టార్గెట్ నిర్ణయించుకున్నట్లు టాక్.