'చరణ్ ఓటు ప్రకాష్ రాజుకే వేశారు.. గెలిచిన తర్వాత ఫస్ట్ ఫోన్ తారక్ నుంచే వచ్చింది'
తెలుగు రాష్ట్రాలతో పాటు సినీ వర్గాల్లో కొన్ని నెలల పాటు చర్చకు దారితీసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఆదివారం ముగిసాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో దిగిన మంచు విష్ణు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ పై గెలుపొంది 'మా' పీఠాన్ని దక్కించుకున్నారు. ఎన్నికలు ముగియగానే ఇన్నాళ్లు కొనసాగిన వివాదానికి తెర పడుతుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా మెగా బ్రదర్ నాగబాబు - ప్రకాష్ రాజ్ - శివాజీ రాజా 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. 'మా' సభ్యులందరూ ఈసారి వారికి సేవ చేయడానికి నన్ను ఎన్నుకున్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ విజయానికి సహకరించిన వారందరికీ నా ధన్యవాదాలు అని మంచు విష్ణు అన్నారు. అవతలి ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు కూడా మా ఫ్యామిలీనే అని.. వంద శాతం అందరం కలిసి పని చేస్తామని విష్ణు తెలిపారు.
నాగబాబు రాజీనామా గురించి మంచు విష్ణు మాట్లాడుతూ.. ఆయన 'మా' కుటుంబ సభ్యులు. మా ఇంటి పెద్దల్లో ఒకరు. ఆవేశంలో రాజీనామా చేసినా నేను ఇప్పుడు ప్రెసిడెంట్ గా యాక్సెప్ట్ చేయడం లేదు. డిజప్పాయింట్ అందరికి ఉంటుంది. పర్సనల్ గా వెళ్లి నాగబాబు గారితో మాట్లాడతాను. రాజీనామా వెనక్కి తీసుకోమని కోరుతాను. ప్రకాష్ రాజ్ గారంటే నాకు ఇష్టం. ఎన్నికల నేపథ్యంలో ఎన్నో మాట్లాడుకున్నాం. గతం గతః. భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ప్రకాశ్ రాజ్ గారి ఐడియాస్ - సలహాలు - పెద్దరికం మాకు కావాలి. అందుకే ఆయన రాజీనామాను కూడా నేను అంగీకరించను అని అన్నారు.
''నాన్ లోకల్ అనే ఫీలింగ్ వల్లే ప్రకాష్ రాజ్ ఓడిపోయారని నేను అనుకోనని... ఎందుకంటే ఓటేసిన వారందరిలో ఎక్కువ శాతం తెలుగు వారే అని.. 260 మంది ఆయన్ని కోరుకున్నారని మంచు విష్ణు అన్నారు. రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు. అయినా సరే చరణ్ ఓటు 99 శాతం ప్రకాష్ రాజ్ కు వెళ్లి ఉంటుందని నాకు తెలుసు.. ఎందుకంటే నా మాదిరిగానే చరణ్ కూడా తండ్రి మాట జవదాటడు.. తండ్రి ఏ స్టాండ్ తీసుకుంటే దానికి 100 శాతం చరణ్ కట్టుబడి ఉంటారు. అతను తండ్రిని అంత ఇష్టపడతారు. అందుకే నా బ్రదర్ ని నేనేమీ అనుకోను. చరణ్ పొజిషన్ లో నేనున్నా అదే చేస్తా. అయినా మేమంతా ఒకటే ఫ్యామిలీ'' అని మంచు విష్ణు అన్నారు.
''నన్ను సైడ్ అయిపోమని చెప్పింది చిరంజీవి అంకుల్. ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నారు కాదా.. ఇంక మరొకరు ఎందుకు.. విష్ణు ను విత్ డ్రా చేసుకోమని చెప్పు అని నాన్న గారితో అన్నారు'' అని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేయడానికి రాకపోవడం పై స్పందిస్తూ.. 'మా' అధ్యక్షుడు గా నేను గెలిచానని చూసిన వెంటనే వచ్చిన ఫస్ట్ ఫోన్ నా తమ్ముడు తారక్ దగ్గర నుంచి. నా తమ్ముడి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. వ్యక్తిగత కారణాలతో తారక్ ఓటు వేయడానికి రాలేదు. అది నాకు తెలుసు. ఎందుకనేది ఇప్పుడు నేను బయటకు చెప్పాల్సిన అవసరం లేదు'' అని మంచు విష్ణు అన్నారు.
ఇకపోతే నిన్న జరిగిన పోలింగ్ లో 'మా' అధ్యక్షుడు మినహా మిగతా ఈసీ మెంబర్ల తుది ఫలితాలు వెల్లడి కాలేదు. తాజాగా మిగతా 18 మంది ఈసీ సభ్యుల ఫలితాలను వెలువరించారు.