మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడుగా హీరో మంచు విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎన్నో హామీలతో అధ్యక్ష పీఠం ఎక్కిన విష్ణు.. తమ ప్యానల్ మేనిఫెస్టో అమలుపై ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు. ఇటీవల మహిళా ఆర్టిస్టుల భద్రత కోసం విమెన్ ఎంపవర్ మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో మరో బిగ్ న్యూస్ చెప్పేందుకు 'మా' కొత్త ప్రెసిడెంట్ రెడీ అయ్యారు.
మంచు విష్ణు శుక్రవారం ట్విట్టర్ వేదికగా మరో రెండు రోజుల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ గురించి ఓ న్యూస్ చెప్పబోతున్నట్లు ప్రకటించారు. ''MAA కు సంబంధించిన ఓ ఎగ్జైటింగ్ న్యూస్ ని ఈ అక్టోబరు 31న మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా బిగ్ న్యూస్'' అని విష్ణు ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఇది మంచు విష్ణు ప్రధాన హామీ 'మా' శాశ్విత బిల్డింగ్ గురించే అయ్యుండొచ్చని అందరూ భావిస్తున్నారు.
MAA కు శాశ్వత భవనం కట్టిస్తాననే ప్రధాన హామీతో మంచు విష్ణు ఎన్నికల బరిలో దిగిన సంగతి తెలిసిందే. తాను గెలిస్తే సొంత డబ్బు ఖర్చు పెట్టి 'మా' బిల్డింగ్ నిర్మిస్తానని.. ఇప్పటికే రెండు మూడు స్థలాలను కూడా పరిశీలించినట్లు ఎన్నికల ముందు విష్ణు చెప్పారు. అయితే ఈ నెల 31న మా అధ్యక్షుడు చెప్తానంటున్న బిగ్ న్యూస్ 'మా' భవనం గురించే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సొంత భవనం నిర్మించాలని సంకల్పించిన మంచు విష్ణు.. భూమి పూజకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. మరి మంచు హీరో చెప్పబోయే ఆ ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
కాగా, మంచు విష్ణు మ్యానిఫెస్టోలో 'మా' బిల్డింగ్ తో పాటుగా స్థానిక నటీనటులకు అవకాశాలు - మహిళా ఆర్టిస్ట్స్ భద్రత - సభ్యుల పిల్లలకు స్కాలర్ షిప్పులు - మెరుగైన మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ - ఇళ్లు లేని సభ్యులకు సొంతింటి కల తీర్చే ప్రణాళిక - పెన్షన్ల సంఖ్య పెంపు మొదలగు హామీలు ఉన్నాయి.
ఇప్పటికే 'మా' లో మహిళల భద్రత కోసం విమెన్ ఎంపవర్ మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ పేరుతో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. దీనికి సోషల్ యాక్టివిస్ట్ సునీతా కృష్ణన్ గౌరవ సలహాదారుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని వెల్లడించారు. మేనిఫెస్టోలో ఉన్న హామీలను అమలు చేయడమే తన తక్షణ కర్తవ్యమని ప్రమాణస్వీకారం సందర్భంగా చెప్పిన విష్ణు.. చెప్పినట్లుగా 'మా' అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అర్థం అవుతోంది.