గత కొంత కాలంగా సరైన హిట్టులేని మంచు విష్ణు ఈ సారి సక్సెస్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టున్నారు. సక్సెస్ లేక రేస్ లో వెనకబడిన ఈ హీరో హిట్టుతో మళ్లీ ట్రాక్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇందు కోసం కామెడీనే నమ్ముకున్నట్టుగా తెలుస్తోంది. మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం చిత్రీకరణ దశలో వుంది. డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈషాన్ సూర్య తెరకెక్కిస్తున్నారు. సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ పాటని హీరో మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్ లపై షూట్ చేస్తున్నారు. ఈ పాటకు చాలా ప్రత్యేకత వుంది. గత కొంత కాలంగా తెలుగులో ఏ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేయని ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యరీతులు సమకూరుస్తుండటం విశేషం. ఇటీవల మంచు విష్ణు ప్రభుదేవా తన ఒళ్లు హూనం చేశాడనే అర్థం వచ్చేలా సోసల్ మీడియా వేదిగా పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. సినిమాకు ప్రభుదేవా డ్యాన్స్ కంపోజ్ చేస్తున్న ఈ పాట హైలైట్ గా నిలవ నుందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో నటిస్తున్నాడు. చాలా సరదాగా ఎంటర్ టైన్ మెంట్ నేపథ్యంలో సాగే ఈ మూవీ సక్సెస్ విషయంలో హరీఓ మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా వున్నారట. ఇందులో సన్నీ లియోన్ రేణుకగా, పాయల్ రాజ్ పుత్ స్వాతిగా కనిపించబోతున్నారు. ఈ ఇద్రితో మంచు విష్ణు చేసే అల్లరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆద్యంతం నవ్వులు పూయించనుందట.
ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ స్కెచ్ లకు మంచి స్పందన లభించింది. సరికొత్త నేపథ్యంలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చోటా. కె. నాయుడు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం, మూలకథ జి. నాగేశ్వరరెడ్డి.