వాటీజ్ దిస్ విష్ణు-ఎందుకిలా చేసావ్?

Update: 2018-03-20 06:19 GMT
మోహన్ బాబు కం బ్యాక్ మూవీగా ఎన్నో అంచనాలతో స్వంత బ్యానర్ లో నిర్మించిన గాయత్రి చివరికి చేదు అనుభవాన్నే మిగిల్చింది. తనవరకు కలెక్షన్ కింగ్ ఏ లోటు లేకుండా మేనేజ్ చేసినా పాత ఫార్ములాలో తీసిన దర్శకుడు మదన్ టేకింగ్ ప్రేక్షకులను మెప్పించలేక చివరికి ఫ్లాప్ ముద్ర వేయించుకుంది. తాజాగా మంచు విష్ణు అఫీషియల్ యు ట్యూబ్ ఛానల్ లో గాయత్రి హెచ్ డి వెర్షన్ అప్ లోడ్ చేసిన కాసేపటికే డిలీట్ చేసేయటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పొరపాటున పెట్టారా లేక ఏదైనా శాటిలైట్ ఛానల్ తోనో లేక అమెజాన్ ప్రైమ్ లాంటి సంస్థలతోనో జరిగిన ఒప్పందంలో భాగంగా తీసేసారా అనే క్లారిటీ మాత్రం రాలేదు. నిజానికి మంచు విష్ణు పక్కా ప్లాన్ తోనే చేసినట్టు ఇన్ సైడ్ టాక్. నిన్న నాన్న పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు కానుక రూపంలో ఇద్దామని గాయత్రి సినిమాను అప్ లోడ్ చేయించాడని, కాని వీడియో హక్కుల విషయంలో కుదిరిన ఒప్పందం గురించి పూర్తి అవగాహన లేకపోవడంతో వెంటనే గుర్తించి తీయించేసాడని ఫ్రెండ్స్ సమాచారం.

విష్ణు ఇలా చేయటం కొత్త కాదు. గతంలో సంపూర్నేష్ బాబుని హీరోగా పెట్టి తన బ్యానర్ మీద నిర్మించిన సింగం 123ని విడుదలైన నెల రోజుల లోపే యు ట్యూబ్ లో పెట్టేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అదే తరహాలో ఫాన్స్ కోసం స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని చేసిన గాయత్రి విడుదల ఇలా అర్ధాంతరంగా వెనక్కు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గాయత్రి గత నెల 9న విడుదలైంది. ఇంకా 50 రోజులు కూడా పూర్తి కాలేదు. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ తాను కొన్న సినిమాలను 28 రోజులకే పెట్టడం రివాజు. ఈ ఏడాది వచ్చిన భాగమతి, టచ్ చేసి చూడు ఇప్పటికే అందుబాటులో ఉంచేసింది. ఈ లెక్కన గాయత్రి హక్కులు కూడా కొని ఉంటే ఈపాటికే స్ట్రీమింగ్ లో ఉండాలి. కాని లేదు అంటే బహుశా వేరే ఛానల్ తో ఒప్పందం జరిగి ఉండొచ్చు.

ఈ వార్త తెలిసేలోపే అధికశాతం వ్యూయర్స్ కు గాయత్రి సినిమా మాయం అయిపోయింది కనక మళ్ళి వచ్చే దాకా వెయిట్ చేసి చూడక తప్పదు. థియేటర్ లో మిస్ అయిన ఈ మూవీ యు ట్యూబ్ లో వచ్చినా టీవీ లో వచ్చినా వ్యూస్ రేటింగ్స్ బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మిస్ అయిన ఈ మూవీ చిన్ని తెరపై ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి
Tags:    

Similar News