బాహుబలి రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్లంటేనే బాలీవుడ్ వాళ్లు సైతం ఔరా అనుకున్నారు. ఇది మరీ పెద్ద రిస్క్ కదా అన్నారు. కానీ బాహుబలి ఫస్ట్ పార్టే రూ.600 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఐతే బాహుబలి సినిమాకు పని చేసిన వాళ్లకున్న ఇమేజ్ వేరు, ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ వేరు.. కాబట్టి ఎంత పెద్ద రిస్క్ చేసినా చెల్లిపోయింది. సినిమా కూడా అంచనాలకు తగ్గట్లే ఉండటంతో సినిమా అంచనాల్ని మించి విజయం సాధించింది. ఐతే ‘బాహుబలి’ని చూసి మంచు విష్ణు చాలా చాలా పెద్ద రిస్కు చేస్తున్నట్లే టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
తనికెళ్ల భరణి దర్శకత్వంలో విష్ణు ‘కన్నప్ప’ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్లని మంచు కాంపౌండ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని హాలీవుడ్ ప్రమాణాలతో తెలుగు, హిందీ - ఇంగ్లిష్ భాషల్లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడట విష్ణు. ఇప్పటికే హాలీవుడ్ నుంచి ఓ గ్రాఫికల్ టీంని హైదరాబాద్ లో దించి.. వాళ్లతో వర్క్ చేయిస్తున్నాడట. ‘కన్నప్ప’ను మామూలు తెలుగు సినిమాలా కాకుండా డిస్నీ వాళ్ల సినిమా తరహాలో హాలీవుడ్ ప్రమాణాలతో తెరకెక్కించాలన్నది విష్ణు ప్లాన్. ఐతే మార్కెట్ పరిధి గురించి ఆలోచించకుండా మరీ ఇంత పెద్ద రిస్క్ చేయడం కరెక్టా అనేదే సందేహం.