లాక్ డౌన్ కారణంగా సినిమా స్టార్స్ అంతా కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో చాలా మంది స్టార్స్ వారి పిల్లలతో ఎక్కువ సమయంను గడుపుతున్నారు. ఎక్కువగా పిల్లలతో గడిపే అవకాశం లేని స్టార్స్ కు కూడా ఇప్పుడు పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. మంచు విష్ణు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా పిల్లలతో సమయం గడుపుతున్నాడు. గత మార్చి నుండి మంచు విష్ణు గడ్డంలోనే కనిపిస్తూ వస్తున్నాడు. ఆయన పెద్ద పాప గడ్డం తీసేస్తే ఒక నెల రోజుల పాటు మాట వింటానంటూ ఛాలెంజ్ చేసింది. అందుకు మోహన్ బాబును సాక్ష్యంగా పెట్టింది. మంచు విష్ణు షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
నాన్న గడ్డం తీసేస్తే నేను నెల రోజుల పాటు నేను చెప్పిన మాట వింటానంటూ మోహన్ బాబు ముందు మంచు విష్ణు కూతురు అంటుంది. అప్పుడు విష్ణు తను ఎప్పుడు కూడా నా మాట వినదు. ఈసారి ఛాన్స్ దక్కింది కదా అంటూ గడ్డం తీసేశాడు. గత ఏడాది మార్చి నుండి అంటే దాదాపుగా 15 నెలలుగా గడ్డంతోనే ఉంటూ ఉన్న విష్ణు గడ్డంను తొలగించాడు. గడ్డంను తీయడంతో మొదట చిన్న పాప విష్ణు ను గుర్తించలేదు. ఆ తర్వాత దగ్గరకు వచ్చింది. ఇక బాబు కూడా సిగ్గు పడుతూ నవ్వుతూ తండ్రి వద్దకు వచ్చాడు.
గడ్డం తీసిన తర్వాత విష్ణు తన తండ్రి వద్దకు వెళ్లగానే ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తల్లి కూడా ఆశ్చర్యంతో ఒక నవ్వు నవ్వింది. ఆ తర్వాత కూతురు వద్దకు వెళ్లి నేను నీ ఛాలెంజ్ ను స్వీకరించాను అన్నట్లుగా నిల్చున్నాడు. అప్పుడు సరే నేను అన్నట్లుగా నెల రోజుల పాటు నీ మాట వింటాను అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది. మొత్తానికి మంచు విష్ణు కూతురు ఛాలెంజ్ తో ఏకంగా ఏడాది తర్వాత గడ్డం తీసి కనిపించాడు.
Full View