'శ్రీదేవి సోడా సెంట‌ర్' నుంచి ఉర్రూతలూగించే 'మందులోడా' మాస్ కా బాస్ సాంగ్..!

Update: 2021-07-09 05:15 GMT
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు.. వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టుగా కథలను ఎంచుకుంటూ.. యూత్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ''శ్రీదేవి సోడా సెంట‌ర్‌'' అనే సినిమాతో వస్తున్నారు సుధీర్ బాబు. 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టైటిల్ తోనే ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్.. ఆ త‌రువాత విడుద‌లైన గ్లిమ్స్ విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ నేప‌థ్యంలో స్వ‌ర మాంత్రికుడు మ‌ణిశ‌ర్మ ట్యూన్ చేసిన మాస్ కా బాస్ సాంగ్ 'మందులోడా' అంటూ సాగే ఓ పాట‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌ల చేశారు.

'అద్దాల మేడల్లో ఉండేటి దాననురా.. సింగపూరు రంగబాబు ఫ్లైటు ఎక్క మన్నాడు..' అంటూ సాగిన ఈ పాటకు ఉత్తరాంధ్ర జానపదాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. మణిశర్మ అందించిన మాస్ బాణీలకు గేయ రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. సింగర్స్ సాహితీ చాంగంటి మరియు ధనుంజయ కలిసి హుషారుగా ఆలపించారు. యష్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేసాడు. ఫుల్ మాస్ ట్యూన్స్ ఇవ్వ‌డంలో స్పెషలిస్ట్ అయిన మ‌ణిశ‌ర్మ‌.. 'మాస్ కా బాస్ సాంగ్ మందులోడా' సాంగ్ తో మాస్ ఆడియన్స్ ను ఉర్రుతలూగించేలా చేశాడనే చెప్పాలి. ఈ పాట లిరిక‌ల్ వీడియోలో హీరో సుధీర్ బాబు వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

''శ్రీదేవి సోడా సెంట‌ర్‌'' సినిమాలో లైటింగ్ సూరిబాబు అనే మాస్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా.. పావెల్ నవగీతన్ - నరేష్ - సత్యం రాజేష్ - రఘుబాబు - అజయ్ - హర్షవర్ధన్ - సప్తగిరి - రోహిణి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 'భ‌లేమంచిరోజు' 'ఆనందో బ్ర‌హ్మ‌' 'యాత్ర' లాంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ చిత్రాలను అందించిన 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ పై ఈ సినిమా రూపొందుతోంది. విజ‌య్ చిల్లా - శ‌శి దేవిరెడ్డి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

Full View




Tags:    

Similar News