అంతకుముందు సినిమా ఎంత సూపర్ హిట్టయినా సరే. అందులో నటించిన తారలకు ఎంత మంచి పేరొచ్చినా సరే. కొత్తగా తీయబోయే సినిమాలో ఆ కథకీ, పాత్రలకీ తగ్గట్టుగా లేరనుకొంటే ఎంతమాత్రం సేమ్ క్యాస్టింగ్ ని రిపీట్ చేయడానికి ఇష్టపడని దర్శకుడు మణిరత్నం. ఆ తరహా దర్శకుల జాబితాలోకి రాజమౌళి - శంకర్ లాంటి వాళ్లు కూడా చేరతారు. హిట్ కాంబినేషన్ అనో, అచ్చొచ్చారనో వీళ్లు తారల్ని ఎంచుకోరు. పాత్రలకి తగ్గట్టుగా ఎవరు బాగుంటారనుకొంటే వాళ్లనే ఎంపిక చేసుకొంటుంటారు. అయితే మణిరత్నం మాత్రం `ఓకే బంగారం`తో నిత్యమీనన్ మాయలో పడ్డారని తెలుస్తోంది. నిజంగానే నిత్య `ఓకే బంగారం`లో అదరగొట్టింది. కేవలం నవ్వులతోనే ఆమె కెమిస్ట్రీ పండించింది. ఆ మేజిక్ వేరే ఏ హీరోయిన్ ఉన్నా వర్కవుట్ అయ్యేది కాదని విమర్శకులు అభిప్రాయపడుతుంటారు. మణిరత్నం కూడా నిత్యని సినిమా తర్వాత పొగిడాడు. ఇప్పుడు తన కొత్త సినిమా లోనూ ఆమెకి ఛాన్సిచ్చాడని సమాచారం.
`కోమలి` పేరుతో మణిరత్నం ఓ సినిమాని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. అందులో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఇంతకుముందు చేసినవాళ్లతో కాకుండా కొత్తవాళ్లను ఎంపిక చేసుకొని సినిమా తీయాలనుకొన్నారు మణిరత్నం. అయితే మణి కోరుకొన్నట్టుగా ఎవ్వరూ సెట్టవ్వలేదు. దీంతో కార్తీ - దుల్కర్ సల్మాన్లని కథానాయకులుగా ఎంపిక చేసుకొన్నాడు. హీరోయిన్ల కోసం చాలామందిని పరిశీలించాడట. అయితే ఇప్పుడు మళ్లీ ఓ పాత్రకోసం నిత్యనే సంప్రదించినట్టు తెలుస్తోంది. మరో కథానాయికగా త్రిష నటిస్తుందట. ఒక్కసారి నిత్యతో కలిసి పనిచేశాక, ఆమె నటనకి అలవాటు పడ్డాక ఎవ్వరైనా ఆమెని మళ్లీ మళ్లీ ఎంపిక చేసుకోవల్సిందేననీ, అంతగా ఆమె పాత్రల్ని హైప్ చేస్తుందనీ, నిత్య నటిస్తే దర్శకుల పని కూడా సులువు అవుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయ పడుతుంటాయి. అదే తరహాలోనే మణిరత్నం నిత్య మాయలో పడిపోయారని తెలుస్తోంది. కోమలి చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.