మణిరత్నం ఏదైనా ఓ కాన్సెప్ట్ ఎంచుకుంటే అందులో భారీతనం అసాధారణ కథ ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఆయన తెరకెక్కించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత పెద్ద రేంజుకు చేరడం లేదు.
ఇంతకుముందు నవాబ్ లాంటి మల్టీస్టారర్ ని మణి సర్ ఎంతో క్లాసిక్ గా తెరకెక్కించినా కానీ అది కొన్ని సెక్షన్లకే నచ్చింది. కానీ ఇప్పుడు హిస్టారికల్ కాన్సెప్టుతో మనసులు దోచేందుకు అతడు చేస్తున్న పాన్ ఇండియా ప్రయత్నం ఏమేరకు మెప్పిస్తుందో చూడాలన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది.
మణిరత్నం నాలుగేళ్లుగా దృష్టిసారించి పని చేస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' కరోనా క్రైసిస్ వల్ల అంతకంతకు ఆలస్యమైంది. ఇటీవల వేగంగా సినిమా పూర్తవుతోంది. తమిళ చిత్రసీమలో మేకింగ్ లో ఉన్న మెస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లలో ఇది ఒకటి. ఈ సినిమా బాహుబలి తరహాలోనే రెండు భాగాలుగా రూపొందుతోంది. భారీ యాక్షన్ .. అసాధారణ పాత్రలు.. ఎమోషన్స్.. విజవల్ గ్రాఫిక్స్ ఆధారంగా దీనిని వెటరన్ దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.
తాజాగా డిజిటల్ రైట్స్ డీల్ ఫైనల్ అయ్యిందని తెలిసింది. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాల పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ చేజిక్కించుకున్నట్లు తాజా సమాచారం. భారీ బడ్జెట్ పీరియడ్ ఎపిక్ లో కార్తీ- విక్రమ్- జయం రవి వంటి పలువురు తమిళ స్టార్ లు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
మాజీ విశ్వసుందరి .. మణిరత్నం శిష్యురాలు ఐశ్వర్యారాయ్ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తోంది. ఇది తమిళ చిత్రసీమలో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ లలో ఒకటిగా నిలుస్తోంది.
తెలుగు-తమిళం-హిందీ-మలయాళం-కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇక పొన్నియన్ సెల్వన్ ని బాహుబలి తరహాలోనే రెండు భాగాలుగా తెరకెక్కించాలన్న మణిరత్నం ప్లాన్ ఏమేరకు వర్కవుటవుతుందో కూడా వేచి చూడాలి.