మణికర్ణిక చిత్రం గురించి ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు, సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా తెగ చర్చ జరుగుతోంది. మొత్తం ఇండియన్ సినీ ప్రముఖులు అంతా కూడా మణికర్ణిక వివాదం గురించి చర్చించుకుంటున్నారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ప్రారంభం అయిన 'మణికర్ణిక' చిత్రం 75 శాతం షూటింగ్ ముగిసిన తర్వాత దర్శకుడు క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు రావడం, ఆ తర్వాత కంగనా సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం జరిగింది. సినిమా విడుదల తర్వాత క్రిష్ తనకు క్రెడిట్ ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే - కంగనా అండ్ టీం మాత్రం మేము చేసిన మార్పుల వల్ల సినిమా నడుస్తుందని - అందుకే ఆయనకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ చెబుతున్న ఈ సమయంలో దేశ వ్యాప్తంగా ఈ వివాదం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతటి వివాదాస్పదం అవుతున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా దూసుకు పోతుంది.
బాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో మణికర్ణిక టాప్ లో నిలిచింది. మొదటి వారం కలెక్షన్స్ లో తను వెడ్స్ మను 70.5 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా - వీరీ దే వెడ్డింగ్ చిత్రం 56.98 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. అయితే తాజాగా విడుదలైన కంగనా 'మణికర్ణిక' చిత్రం మొదటి వారం రోజుల్లో 60.15 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది.
మొదటి మూడు రోజుల కలెక్షన్స్ విషయంలో కూడా 'మణికర్ణిక' చిత్రం రికార్డు సృష్టించింది. మొన్నటి వరకు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకుని మొదటి స్థానంలో ఉన్న తను వెడ్స్ మను(38.05 కోట్లు) చిత్రంను 'మణికర్ణిక'(42.55 కోట్లు) క్రాస్ చేసింది. మొత్తానికి లాంగ్ రన్ లో సునాయాసంగా 100 కోట్లను ఈ చిత్రం రాబట్టడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఇక శాటిలైట్ - ప్రైమ్ వీడియో ఇతర రైట్స్ ద్వారా మరో 50 కోట్లకు అటు ఇటుగా వచ్చి నిర్మాతలను సేఫ్ చేయడం ఖాయంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.