దక్షిణాదిలోని మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో మణిరత్నం ఒకరు. సినిమా జయాపజయాలతో పని లేకుండా మణిరత్నం సినిమాను ఆదరించే ప్రేక్షకులున్నారు. లేట్ గా వచ్చినా...లేటెస్ట్ కాన్సెప్ట్ తో మణిరత్నం వస్తారని ఎదురుచూసే అభిమానులున్నారు. `చెలియా`తో డిజాస్టర్ కొట్టిన ఈ తమిళ దర్శకుడు...తాజాగా ఈ నెల 27న నవాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే, ఈ సినిమాలో శింబు పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పిన టాలీవుడ్ నటుడు సత్యదేవ్ కు మణి .....బంపర్ ఆఫర్ ఇచ్చాడని టాక్ వస్తోంది. తన తర్వాతి సినిమాలో సత్యదేవ్ కు ఓ క్యారెక్టర్ ఇస్తానని మణి ప్రామిస్ చేశారట. అయితే, ఈ ప్రామిస్ ను మణిరత్నం ఎంతవరకు నిలబెట్టుకుంటాడనేదానిపై ఇపుడు టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.
మణి సినిమాలో చాన్స్ కోసం చాలామంది ఆర్టిస్ట్ లు ఎదురుచూస్తుంటారు. ప్రతి పాత్ర విషయంలో మణి చాలా కేర్ తీసుకుంటాడు. ఎక్కువగా తమిళ నటీనటులతో కంఫర్ట్ ఫీల్ అయ్యే మణి.తెలుగు నటులకు చాన్స్ లు చాలా తక్కువగా ఇచ్చారు. ఆ కోవలోనే ‘నవాబ్’లో జయసుధకు ఓ ముఖ్య పాత్ర ఇచ్చాడాయన. `నవాబ్`లో శింబు పాత్రను అర్థం చేసుకుని డబ్బింగ్ చెప్పిన తీరు నచ్చి అతడికి తన తర్వాతి సినిమాలో వేషం ఇస్తానని మణి హామీ ఇచ్చాడట. ఆ సినిమాలో సత్యదేవ్ కు ఓ కీలక పాత్ర ఇవ్వబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రామిస్ నెవరేర్చుకుంటాడా లేదా అని టాలీవుడ్ లో చర్చజరుగుతోంది. ‘ఓకే బంగారం’ సినిమాలో దుల్కర్ పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పిన నానికి కూడా ఇలాగే హామీ ఇచ్చినట్లు వదంతులు వచ్చాయి. కానీ, అది జరగలేదు. ఇపుడు సత్యదేవ్ కు ఆ చాన్స్ దక్కుతుందో లేదో చూడాలి.