భారీ చిత్రాలకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అది సవాళ్లతో కూడుకున్నదే. ముఖ్యంగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలకు పని చేయడం అంటే అందుకోసం గంటల కొద్దీ సమయం వెచ్చి రేయింబవళ్లు శ్రమించాల్సి ఉంటుంది. హిస్టరీపై బోలెడంత స్టడీ చేయాల్సి ఉంటుంది. పద్మావత్ - మణికర్ణిక- జోదా అక్బర్ - కళాంక్- తక్త్- తానాజీ .. వంటి చిత్రాలకు పని చేయాలంటే ఫ్యాషన్ డిజైనర్లకు అదో ఛాలెంజ్ లాంటిది. అయితే ఇలాంటి భారీ చిత్రాలకు డిజైనర్ గా పని చేసిన నిపుణుడిగా మనీష్ మల్హోత్రాకు పరిశ్రమలో ఎంతో గౌరవం ఉంది.
సినిమా అంటేనే సృజనతో కూడుకున్నది. ఇక ఇందులో ఫ్యాషన్స్ .. స్టైలింగ్స్ పరంగా ఎంతో క్రియేటివిటీ చూపించాల్సి ఉంటుంది. రొటీనిటీ లేకుండా ప్రతిసారీ కొత్తదనం ట్రై చేయాలి. ఇందులో తన సమర్థతను నిరూపించుకున్నారు మనీష్ మల్హోత్రా. ఇక ఆయనకు ఫ్యాషన్స్ పరంగా తొలి నాళ్లలో మామ్ శ్రీదేవి స్ఫూర్తిగా నిలిచారట. తన స్లీవ్ లెస్ స్టైల్ సహా రకరకాల ఫ్యాషన్ అనుకరణను నిశితంగా గమనించేవాడట. ఆ తర్వాత తన సినిమాలకే పని చేశారు. అందుకే శ్రీదేవి అంటే తనకు ఎంతో అభిమానం అని అంటున్నారాయన. 53 ఏళ్ల ఆయన జీవితంలో 30 ఏళ్లు పూర్తిగా ఫ్యాషన్ ఇండస్ట్రీకే అంకితమిచ్చారు.
ఇక ప్రస్తుతం పని చేస్తున్న మొఘలుల చరిత్రతో తెరకెక్కిస్తున్న మూవీ కోసం ఈ వయసులోనూ రోజుకు 16-18 గంటలు శ్రమిస్తున్నారట. క్లిష్టంగా ఉండే పనిని నాకే అప్పజెబుతారు. అదే నాకు కూడా ఇష్టం. దానిని ఛాలెంజింగ్ గా తీసుకుని పూర్తి చేస్తానని తెలిపారు. మరో డిజైనర్‌కి సాధ్యపడని విధంగా ఇండియన్ ఫ్యాషన్ బిజినెస్ లో ఒక ముఖ్యమైన భాగం అవ్వడం గర్వంగా అనిపిస్తుందని మనీష్ అన్నారు. టాలీవుడ్ లో నాకు సమంత- విజయ్ దేవరకొండ- ప్రభాస్- ఎన్టీయార్- మహేష్- పూజాహెగ్డే... వీళ్లంతా నచ్చే తారల అని తెలిపారు.