మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైం హిట్ పాటల్లో ‘చూడాలని ఉంది’లోని రామ్మా చిలకమ్మా.. సాంగ్ తప్పకుండా ఉంటుంది. ఉదిత్ నారాయణ పాడిన ఈ పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. సినిమాకు ఆ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐతే పాటను ముందు చిరంజీవి తిరస్కరించారట. ఈ పాట వద్దని అన్నారట. దీని బదులు సంగీత దర్శకుడు మణిశర్మ వేరే పాటను కూడా ట్యూన్ చేశారట. ఐతే మెజారిటీ అభిప్రాయం మేరకు ఈ పాటనే సినిమాలో పెట్టారట.
‘‘నేను అప్పుడప్పుడూ పాటల్లో ప్రయోగాలు చేస్తుంటా. అలా చేసిన పాటే.. రామ్మా చిలకమ్మా. ఈ పాట విన్న చిరంజీవి గారు ఇది వద్దన్నారు. నేను చాలా ఆత్మవిశ్వాసంతో చేసిన పాట అది. కానీ ఆయన వద్దనడంతో వేరే పాట రికార్డు చేశా. కానీ సెట్లో డ్యాన్సర్లందరూ రెండు పాటలూ విని.. ‘రామ్మా చిలకమ్మా’కే ఓటేశారు. చాలామంది చెప్పేసరికి చిరంజీవి గారు కూడా ఓకే అన్నారు. ఆ పాట సూపర్ హిట్టయింది. ఐతే అలాంటి హిట్ పాటను మళ్లీ చేయాలనుకుంటే కుదరదు. అద్భుతాలు అనుకోకుండా వాటికవే జరిగిపోతాయి’’ అని మణిశర్మ అన్నారు.
గతంతో పోలిస్తే తనకు అవకాశాలు తగ్గినప్పటికీ.. తాను తన సంగీతం విషయంలో రాజీ పడబోనని... తన స్టయిల్లో తాను సంగీతం చేసుకుంటూ వెళ్తానని మణిశర్మ అన్నాడు. ‘‘నాకు కథే ముఖ్యం. హీరోల ఛాయిస్ వల్ల సంగీతానికి కథతో.. సందర్భాలతో పనిలేకుండా పోతోంది. దీని వల్ల సంగీత దర్శకులపై ఒత్తిడి ఎక్కువైంది. అందుకే నేను చిన్న దర్శకులతో పని చేస్తున్నా. చిన్న సినిమాలు చేస్తున్నా. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య ‘శమంతకమణి’.. హను రాఘవపూడి ‘లై’ ఇంకొన్ని చేస్తున్నా. యువ దర్శకులు కథకు తగ్గట్టు మంచి సంగీతాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల్లో నా పాటలు వినండి. ట్యూన్స్.. లిరిక్స్ బాలేవని.. అర్థం కావట్లేవని చెప్పండి. ఇప్పుడే అస్త్ర సన్యాసం చేసేస్తా. నేను ఎవరి దగ్గరా చేతులు కట్టుకోవల్సిన అవసరం లేదు. ఎవరి దయతోనూ నేను బతకడం లేదు’’ అని మణిశర్మ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/