మెగాస్టార్‌ నమ్మి అవకాశం ఇస్తే నిరాశ పర్చాడు

Update: 2022-05-09 02:30 GMT
ఒకప్పుడు మహేష్‌ బాబు తన ప్రతి సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా మణిశర్మ ఉండాల్సిందే అంటూ పట్టుబట్టే వాడట. ఇక బాలకృష్ణ తన సీమ సినిమాలకు మణిశర్మ సంగీతాన్ని ఇవ్వాల్సిందే అనే పట్టుదలతో ఉండేవాడు. చిరంజీవి మరియు మణిశర్మల కాంబోలో అద్బుతమైన మ్యూజిక్ ఆల్బమ్స్ వచ్చాయి. ఆమద్య కాస్త డౌన్‌ అయినా మళ్లీ మణిశర్మ పుంజుకుంటున్నాడనే ఉద్దేశ్యంతో ఆచార్య సినిమాకు చిరంజీవి పిలిచి మరీ అవకాశం ఇచ్చాడట.

పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కచ్చితంగా మణిశర్మ మెప్పిస్తాడని నమ్మి అవకాశంను చిరంజీవి ఇస్తే ఆచార్య విషయంలో తీవ్రంగా నిరాశ పర్చాడు. ఒకటి రెండు పాటలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా కూడా ఓవరాల్‌ గా మ్యూజిక్ కు నెగటివ్‌ మార్కులు పడ్డాయి. సినిమా ప్లాప్ అవ్వడం వల్ల మణిశర్మ సంగీతం కు ట్రోల్స్ పడలేదు కాని సినిమా బాగుండి మణిశర్మ సంగీతం ఇలాగే ఉంటే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ స్వయంగా మణిశర్మ ను విమర్శించేవారు.

ఆచార్య సక్సెస్ అయితే మళ్లీ మహేష్‌ బాబుతో పాటు సీనియర్ స్టార్‌ హీరోలు కూడా మణిశర్మ ను పిలిచి అవకాశం ఇస్తారని అంతా భావించారు. కాని మొత్తం తారు మారు అయ్యింది. ఆచార్య వంటి అద్బుతమైన అవకాశం ను మెలోడీ బ్రహ్మా మణిశర్మ మిస్‌ చేసుకున్నాడు. పాటలకు స్కోప్ లేదు అనుకుంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయినా సక్రమంగా ఇస్తే బాగుండేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి మెగా స్టార్‌ చిరంజీవి నమ్మి అవకాశం ఇస్తే ఆచార్య కు లాభం కాదు కదా నష్టం కలిగించాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ఆచార్య సినిమా కు అన్ని విధాలుగా నష్టం తప్పలేదు. సినిమా లో పాటలు బాగున్నా కూడా కొంత మేరకు సినిమా కు జనాలు క్యూ కట్టేవారు.

ఆచార్య సినిమా ప్లాప్‌ అవ్వడం వల్ల మణిశర్మ మళ్లీ చిన్నా చితక సినిమాలకు సంగీతాన్ని ఇవ్వాల్సిందే. మరేదైనా పెద్ద అవకాశం రావాలంటే అదృష్టం కలిసి రావాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ ల్లో ఏదైనా మళ్లీ ఆయనకు జీవం పోసేనా అనేది చూడాలి. ఇప్పుడు ఆయన ప్లాప్స్ చవిచూస్తున్నా ఒకప్పుడు ఆయన ఇచ్చిన పాటలు ఇప్పటికి కూడా యూట్యూబ్‌ మరియు ఇతర సాంగ్స్ స్ట్రీమింగ్స్ ప్లాట్‌ ఫామ్స్ పై రచ్చ చేస్తూనే ఉన్నాయి.
Tags:    

Similar News