పని లేని హీరోయిన్లు.. పిచ్చెత్తిస్తున్నారు..

Update: 2016-05-16 11:25 GMT
కొంతమంది హీరోయిన్లు అంతే.. వారికి ఛాన్సులు పుష్కలంగా వచ్చినా కూడా ఎందుకోగాని హిట్లు మాత్రం ఉండవు. దానితో కెరియర్‌ చాలా ఫాస్టుగా డౌన్‌ అయిపోతుంది. అప్పట్లో ఎం.టివి వీజెగా అందరికీ తెలిసిన బ్యూటి షెనాజ్‌ ట్రెజరీవాలా. హీరోయిన్‌ గా ప్రయత్నించి ఫెయిలవ్వడంతో.. ఇక డ్రాప్ అయిపోయింది. సొంతంగా ట్రావెల్‌ షో లు అవీ ఇవీ చేస్తుంటుంది. అలాగే జానె తూ యా జానె నా సినిమాతో హీరోయిన్‌ అయిపోయి.. తెలుగులో కూడా ఓ రెండు సినిమాలో నటించింది మంజరీ ఫద్నిస్‌. ఈమె కూడా ప్రస్తుతం ఖాళీయే. ఈ భామలిద్దరూ అందగత్తెలంటే అందగత్తెలే. కాని ఏం లాభం.. నో ఛాన్సెస్‌ ఇప్పుడు.

ఇకపోతే ఇద్దరూ కూడా వేర్వేరు ప్రదేశాల్లో ఒకేలాంటి ఎంజాయ్‌ మెంట్ లో బిజీగా ఉన్నారు. ఇండోనేషియాలోని బాలి ఐల్యాండ్‌ వెళ్ళిన షెనాజ్‌.. అక్కడసలు పూర్తిగా బట్టలు వేసుకోవడమే మర్చిపోయింది. అదేలేండి.. ఎల్లప్పుడూ బికినీల్లోనే కాలక్షేప్పం చేస్తోంది. కురచ కురచ టూ పీసుల్లో చక్కగా బాత్‌ టబ్బుల్లోనూ స్విమ్మింగ్‌ పూల్స్‌ లోనూ ఎంజాయ్‌ చేస్తూ.. ఆ హాట్‌ ఫోటోలను తన అభిమానులతో షేర్‌ చేసుకుంటోంది. వాటి సిగదరగా.. ఆ ఫోటోలు మామూలుగా లేవనుకోండి. ఇక మంజరీ ఫద్నిస్‌ కూడా అంతే. అమ్మడు మలేసియా వెళ్ళి.. అక్కడ ఒక ఇన్ఫినిటీ స్విమ్మింగ్‌ పూల్‌ లో అలా ఫోజులిచ్చింది. కాకపోతే అమ్మడు బికినీలో ఉండగా.. బ్యాకు నుండి మాత్రమే ఫోటోలు పెడుతుంటుంది. ఫ్రంట్‌ నుండి నో ఫోటోస్‌ అనే రూల్‌ పెట్టుకుందట. ఏదేమైనా.. పనిలేని హీరోయిన్లు ఇలా మనకు పిచ్చెత్తిస్తున్నారంతే!!
Tags:    

Similar News