నా సినిమా నచ్చకపోతే వారు వేస్ట్ ఫెలోస్

Update: 2018-02-09 17:30 GMT
ఈ రోజుల్లో ఎంత మంచి సినిమాకైనా ప్రమోషన్స్ చాలా అవరమని అందరికి తెలిసిందే. ఎలాగైనా హిట్టు అందుకోవాలని స్టార్ హీరోలు సైతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా పాల్గొంటూ ఉంటారు. ప్రమోషన్స్ చేయడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కానీ ఫైనల్ పాయింట్ కి వచ్చేసరికి అందరిదీ ఒకే మాట. దయచేసి ఈ మంచి సినిమాను ఆదరించి మాకు సపోర్ట్ చేయగలరని మనవి అంటూ.. చాలా మంది ఎంతో విధేయతతో చెప్పేస్తారు. కానీ మహేష్ సోదరి మంజుల మాత్రం ఎవరు ఉహించని విధంగా సౌండ్ ఇచ్చింది.

ఆఖరికి రామ్ గోపాల్ వర్మ కూడా ఈ మాట అనలేదేమో.. గాని మంజుల ఘట్టమనేని మాత్రం మనసుకు నచ్చింది సినిమా ఎవరికైనా నచ్చకుంటే వారు వేస్ట్ ఫెలోస్ అని చేప్పేసింది. సాధారణంగా ప్రతి ఒక్కరు అందరికి నచ్చాలనే సినిమా తీయాలని అనుకుంటారు. కానీ ఆడియెన్స్ కి నచ్చితే చూస్తారు లేకుంటే లేదు. ఫెయిల్ అయినా కూడా దర్శకనిర్మాతలు తప్పు అనుకుంటారే గాని ఆడియెన్స్ తప్పు అని అనలేరు. అయితే మంజుల తెరకెక్కించిన మనసుకు నచ్చింది సినిమా చాలా బావుంటుందట. ఫీల్ గుడ్ లవ్ స్టొరీ అని అందరికి నచ్చుతుందని చెప్పింది. సందీప్ కిషన్ - అమైరా దస్తూర్ సినిమాలో హీరో హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు.

అయితే ఫైనల్ గా సినిమా అయితే ఎవరికి నచ్చదో వారి వేస్ట్ ఫెలోస్ అని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అన్ని సినిమాలు అందరికి నచ్చవని ఎప్పటి నుంచో వస్తోన్న సంప్రదాయమే. కొందరికి బాహుబలి కూడా నచ్చలేదు. అలా అని వారిని వెస్ట్ అనలేము. ఎవరి టెస్టులు వారికి ఉంటాయి. కానీ మంజుల ఆ విషయాలను పట్టించుకోకుండా ఇలా మాట్లాడటం అంత మంచిది కాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాపై కొన్ని పాజిటివ్ వైబ్రెషన్స్ ఉన్నాయి. మరి ఇంత గట్టిగా చెబుతున్న ఆమె ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.




Tags:    

Similar News