నటిగా.. నిర్మాతగా చక్కటి విజయాలు అందుకున్న సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని సినిమా డైరెక్ట్ చేసింది.సందీప్ కిషన్ ను హీరోగా పెట్టి మనసుకు నచ్చింది సినిమాను తెరకెక్కించింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టెయినర్ గా ఈ సినిమాను తీశామంటూ చెప్పుకొచ్చిన మంజుల పబ్లిసిటీ విషయంలో ఎక్కడా డోకాలేకుండా జాగ్రత్త పడింది.
ఈ సినిమాకు స్టార్ ఇమేజ్ ను యాడ్ చేయడం కోసం తమ్ముడు మహేష్ బాబుతో మంజుల వాయిస్ ఓవర్ ఇప్పించింది. దాంతోపాటు మహేష్ కూడా సినిమా ప్రమోషన్స్ కూడా బాగా చేశాడు. ఇదే ప్రమోషన్ టైంలో మంజుల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావనా తెచ్చింది. పవన్ - మహేష్ మంచి స్నేహితులంటూ... తన అన్న రమేష్ బాబు నిర్మించిన అర్జున్ సినిమా పైరసీ బారిన పడ్డ సమయంలో పవన్ చాలా సహాయం చేశాడంటూ గుర్తు చేసుకుని మరీ చెప్పింది. పవన్ తో ఓ సినిమా తీయాలని ఉందని.. కథ కూడా తన దగ్గర సిద్దంగా ఉందని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చింది.
మంజుల ఈ రేంజిలో ఇద్దరు స్టార్లను ఈ మూవీ ప్రమోషన్లలో ఇన్వాల్వ్ చేసినా మనసుకు నచ్చింది సినిమా జనాలకు నచ్చలేదు. మొదటి రోజే టాక్ తేడా వచ్చి థియేటర్లలో ప్రేక్షకుల సందడి లేకుండా పోయింది. సినిమా ప్రేక్షకులందరి తన మనసుకు నచ్చేలా కాకుండా ప్రేక్షకులందరి మనసుకు నచ్చేలా తీస్తే జనాదరణ బాగానే ఉండేది. సినిమా బాగోలేకపోతే పవన్ చెప్పినా రారు.. మహేష్ చెప్పినా రారు.. ఈ విషయం వాళ్లిద్దరికీ ఈమధ్య అనుభవమైన విషయమే.