వెబ్ సీరీస్ లు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఇప్పటికే బాలీవుడ్ లో పెద్ద హీరోలు.. హీరోయిన్లు వెబ్ సిరీస్ లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక పెద్ద ప్రొడక్షన్ హౌసులు కూడా వెబ్ సీరీస్ నిర్మించేందుకు.. వాటికి భారీ బడ్జెట్లు కేటాయించేందుకు ముందుకొస్తున్నారు. తెలుగులో పెద్ద హీరోలు.. నిర్మాతలు ఎవ్వరూ ఇంకా వెబ్ సీరీస్ వైపు చూడడంలేదు గానీ ఇక్కడా కూడా ట్రెండ్ అయితే మొదలైంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని తాజాగా ఒక వెబ్ సిరీస్ నిర్మించే ప్రయత్నాలలో ఉన్నారు. మంజుల గతంలో ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెయిన్ స్ట్రీమ్ సినిమాలు నిర్మించారు గానీ ఈమధ్య సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు సేమ్ బ్యానర్ పై ఈ వెబ్ సీరీస్ నిర్మిస్తారట. ఈ వెబ్ సీరీస్ కు 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ఇప్పటికే ఈ వెబ్ సీరీస్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జోరుగా సాగుతోందట. ఈ ఏడాది చివరలో సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.
మంజుల రీసెంట్ గా డైరెక్షన్ లో తన లక్కును టెస్ట్ చేసుకుంది. సందీప్ కిషన్ హీరోగా 'మనసుకు నచ్చింది' అనే సినిమాను తెరకెక్కించగా ఆ సిన్నిఅమ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తూ వెబ్ సీరీస్ తో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది. సూపర్ స్టార్ సిస్టర్ ఈ ప్రయత్నంలో విజయం సాధించాలని కోరుకుందాం.