'మ‌న్మ‌ధుడు 2' ప్రీరిలీజ్ బిజినెస్

Update: 2019-08-06 05:48 GMT
కింగ్ నాగార్జున న‌టించిన `దేవ‌దాస్`(2018) క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఆశించిన స్థాయి విజ‌యం సాధించ‌లేదు. వ‌సూళ్లు నిరాశ‌ప‌రిచాయి. అయినా ఆ ప్ర‌భావం `మ‌న్మ‌ధుడు 2` పై లేనేలేద‌ని తాజాగా రివీలైన బిజినెస్ లెక్క‌లు చెబుతున్నాయి. 60 ఏజ్ లోనూ కింగ్ న‌వ‌మ‌న్మ‌ధుడిగా చెల‌రేగుతుంటే తెర‌పై ఎలా క‌నిపిస్తారో చూడాల‌న్న ఉత్సాహం యూత్ లో ఉంది మ‌రి. టీజ‌ర్ .. ట్రైల‌ర్ యూత్ కి క‌నెక్ట‌వ్వ‌డం బిజినెస్ కి క‌లిసొస్తోంద‌నే అర్థ‌మ‌వుతోంది.

`మ‌న్మ‌ధుడు 2` థియేట్రిక‌ల్ .. నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ లెక్క‌లు చూస్తే ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. నాన్ థియేట్రిక‌ల్ ఇప్ప‌టికే 20 కోట్లు పైగా బిజినెస్ సాగింద‌ని లెక్క‌లు రివీల‌య్యాయి. తాజాగా థియేట్రిక‌ల్ బిజినెస్ కి సంబంధించిన స‌మాచారం అందింది. ఈ సినిమా ఇరు తెలుగు రాష్ట్రాలు ఓవ‌ర్సీస్ క‌లుపుకుని వ‌ర‌ల్డ్ వైడ్ ఏకంగా 21 కోట్ల మేర బిజినెస్ చేసింద‌ని తెలుస్తోంది. నైజాంలో అడ్వాన్సుల ప్రాతిప‌దిక‌న రిలీజ్ చేస్తుంటే.. ఉత్త‌ర ఆంధ్రాలో నిర్మాత‌లే స్వ‌యంగా రిలీజ్ చేస్తున్నారు. ఏరియా వైజ్ చూస్తే..నైజాం-7కోట్లు.. సీడెడ్-2.5కోట్లు.. ఆంధ్రా (ఎన్‌.ఆర్.ఏ)-7 కోట్లు.. ఏపీ+తెలంగాణ - 16.5కోట్లు, ఓవ‌ర్సీస్ -2.40కోట్లు.. ఇత‌ర భార‌త‌దేశం-1.60 కోట్లు.. మొత్తంగా 20.50కోట్లు బిజినెస్ చేశారు.

అలాగే రిలీజ్ తేదీ విష‌యంలో ప‌క్కాగా ఉండే కింగ్ నాగార్జున ఈసారి `మ‌న్మ‌ధుడు 2` కోసం అంతే తెలివిగా సెల‌వు దినాల్ని ప‌రిగ‌ణించి ప్లాన్ చేశారు. ఆగ‌స్టు 9న రిలీజ్ ప్లాన్ చేయ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం సెల‌వులే. ఆగ‌స్టు 12 (బ‌క్రీద్).. ఆగ‌స్టు 15 ప‌బ్లిక్ హాలిడేస్. ఆగస్టు 11 ఆదివారం అద‌నంగా క‌లిసొస్తోంది. అంటే సినిమా రిలీజ్ త‌ర్వాత మూడు సెల‌వులు క‌లెక్ష‌న్ల‌కు ప్ల‌స్ కానున్నాయి. తొలి వీకెండ్ .. తొలి వారం వ‌సూళ్ల‌తో సేఫ్ గేమ్ సాధ్య‌మేన‌ని మ‌న్మ‌ధుడి టీమ్ అంచ‌నా వేశార‌ట‌.
Tags:    

Similar News