​మనోజ్ రేంజ్ బాగా పెరిగిందే​

Update: 2016-02-26 04:38 GMT
ఇప్పటి వరకు మంచు మనోజ్ నటించిన ఏ సినిమా కూడా వెయ్యి స్క్రీన్లలో ప్రదర్శించబడింది లేదు. తొలిసారిగా ఏకంగా వెయ్యి స్క్రీన్లలో అతని తాజా చిత్రం ‘శౌర్య’ ప్రదర్శించబడటానికి రెడీ అవుతోంది. మంచు మనోజ్ సరసన రెజీనా నటించిన ఈ చిత్రానికి ‘సంతోషం’ ఫేం దశరథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీని ప్రభాస్ తో తీసి హిట్టు కొట్టాడు. అయితే రెండోసారి నాగార్జునతో కలిసి ‘గ్రీకువీరుడు’ సినిమా చేశాడు. అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా శౌర్య మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాత శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్నారు. గతంలో ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే సినిమాను నిర్మించారాయన. మార్చి 4వ తేదీన శౌర్య మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్న ఆయన మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ ‘ఇదో డిఫరెంట్ క్రైమ్ బేస్డ్ థీమ్ మూవీ. ఈ సినిమా లైన్ నచ్చి.. దశరథ్ తో చేయడానికి అంగీకరించా. ఎలాంటి మూవీనైనా తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు పొందగల ధైర్యం దశరథ్ సొంతం. ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్టును నేనే ఎంపిక చేశా. అలాగే టెక్నీషియన్స్ ను కూడా చేశాం. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడం నాకు అలవాటు. చాలా క్వాలిటీగా ఈ సినిమా వచ్చింది. మార్చి4న ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో ఓ 700 థియేటర్లు, ఓవర్సీస్ లో మరో 300 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే ఉగాది రోజున ఓ ప్రముఖ హీరోతో ఓ కొత్త సినిమాను ప్రారంభించబోతున్నా’ అన్నారు.

ఇంకా మాట్లాడుతూ ‘చాలా మంది దర్శకులు సినిమాలు చేస్తాం అంటూ వస్తుంటారు. వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది నేను పట్టించుకోను. నచ్చితే సినిమా చేస్తా. వారికి టెక్నికల్ గ్రిప్ వుండాలి. కొత్తవారిని చూడగానే అతనిలో దర్శకుడి క్వాలిటీస్ వున్నాయా లేదా అనేది నాకు తెలిసిపోతుంది’ అన్నారు.
Tags:    

Similar News