మను - టాక్ అఫ్ ది మూవీ

Update: 2018-09-08 07:10 GMT
నిన్న చిన్న సినిమాల పెద్ద పోటీగా విడుదలైన వాటిలో కేరాఫ్ కంచరపాలెంతో పాటు అందరి దృష్టిని ఆకట్టుకున్న మను కూడా ఉంది. చాలా కాలం తర్వాత తెలుగులో క్రౌడ్  ఫండింగ్ ద్వారా నిర్మించిన మూవీ కావడంతో సోషల్ మీడియాలో కూడా దీని మీద చాలా ట్రెండింగ్ జరిగింది. బ్రహ్మానందం వారసుడు రాజా గౌతం చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపించిన మూవీ కూడా ఇదే. ఇక టాక్ విషయానికి వస్తే ఒక థ్రిల్లర్ ని చాలా డిటైల్డ్ నేరేషన్ తో దర్శకుడు ఫణింద్ర నరిశెట్టి రూపొందించిన తీరు ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేకపోతోంది. ఇలాంటి జానర్ లో వచ్చే వాటికి రెండు గంటల వ్యవధికే అలవాటు పడిన ఆడియన్స్ మను ఏకంగా మూడు గంటల సేపు ఉండటం వల్ల అసహనంగా కదులుతున్నారు. పైగా టేకింగ్ ప్రతిభావంతంగా ఉన్నా స్క్రీన్ ప్లే స్లోగా ఉండటంతో బాగా ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతోంది. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ బలంగా నిలుస్తుండగా అదొక్కటే మనుని చూడడానికి కావలసిన కారణంగా నిలవడం లేదు. ఒక పెయింటింగ్ ఆర్టిస్ట్ జీవితంలో చెలరేగిన ప్రేమ ప్లస్ అలజడి ఎలాంటి పరిణామాలకు దారి తీసింది అనే కాన్సెప్ట్ తో రాసుకున్న మను పేపర్ మీద కనిపించినంత గ్రిప్పింగ్ గా తెరమీద లేకపోవడం మైనస్ గానే నిలుస్తోంది.

ఓపికతో దర్శకుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని లీనమైతే మను ఓమాదిరిగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండేది కాని మను విషయంలో అలా జరిగే అవకాశం తక్కువే. హీరొయిన్ చాందిని చౌదరితో పాటు ఇతర ఆర్టిస్టులు జాన్ కటోలి-మోహన్ భగత్-అభిరామ్-శ్రీకాంత్ ముళ్ళగిరి ఎవరికి వారు మూడ్ కు తగ్గ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినప్పటికీ కాన్సెప్ట్ ని డ్రాగ్ చేయటం వల్ల మను సోసోగానే అనిపిస్తోంది. ఫిలిం మేకర్స్ కు మంచి రిఫరెన్స్ లా అనిపించే మను మాములు ప్రేక్షకులకు మాత్రం మింగుడు పడటం కష్టం. నరేష్ కుమరన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఎలివేట్ కాగా నిడివి శాపంగా మారిన మను తనతో పాటు వచ్చిన వాటి పోటీని తట్టుకోవడం సులభం కాదు. థ్రిల్లర్ ని గ్రిప్పింగ్ నేరేషన్ తో చెబితేనే ప్రేక్షకులు మెచ్చుతారు. అలా కాకుండా దర్శకుడు తన సాంకేతిక పరిజ్ఞానం మొత్తాన్ని ఒకే సినిమాలో చూపిస్తే మాత్రం అది మను అవుతుంది. ఓ ప్రత్యేకమైన టేస్ట్ తో చూస్తే తప్ప మను బాగుంది అనిపించుకోదు. ఈ కారణంగానే మనుకి డివైడ్ టాక్ బాగా వినిపిస్తోంది. వీక్ ఎండ్ కాబట్టి ఈ రెండు రోజులు వసూళ్ళను ఎలా రాబడుతుంది అనే దాన్ని బట్టే మను ఫైనల్ స్టేటస్ డిసైడ్ అవుతుంది.
Tags:    

Similar News