బాలీవుడ్ తో పాటు దాదాపు అన్ని సినీ పరిశ్రమలను కుదిపేసిన అంశం మీటూ. బాలీవుడ్ లో ఎంతో మంది సినీ ప్రముఖులు మీటూ కారణంగా పరువు పోగొట్టుకున్నారు. లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న వారు ఎంత మంది తప్పు చేశారో తెలియదు కాని - ఆరోపణలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు హీరోయిన్స్ పబ్లిసిటీ కోసం లేనిపోని లైంగిక వేదింపుల ఆరోపణలకు పాల్పడుతున్నారనే విమర్శలు మొదటి నుండి వస్తున్నాయి. అలాంటి వారి వల్ల ఈ మంచి ఉద్యమం ఉద్దేశ్యం దెబ్బ తింటుంది.
మీటూపై ఇదే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ఈ అభిప్రాయంను వ్యక్తం చేయడం వల్ల విమర్శల పాలవుతున్నారు. ముఖ్యంగా హీరోలు లేదా దర్శకులు మీటూ ఉద్యమం గురించి మాట్లాడితే మాత్రం వివాదం అవుతోంది. హీరోయిన్స్ పబ్లిసిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ ఇటీవలే మోహన్ లాల్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. దాంతో ఆయనపై కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే హీరోయిన్స్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు.
ఎంతో మంది హీరోయిన్స్ మీటూకు మద్దతు పలుకుతూనే ఈ ఉద్యమం దారి తప్పిందని వ్యాఖ్యలు చేశారు. మీటూను అడ్డం పెట్టుకుని కొందరు పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ పలువురు హీరోయిన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా ప్రియమణి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. కాని ఆమెపై మాత్రం విమర్శలు రావడం లేదు. ఒకే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నా కూడా హీరోలపై ఒకలా - హీరోయిన్స్ పై మరోలా రియాక్ట్ అవుతుండటం విచిత్రంగా అనిపిస్తుంది. ఏది ఏమైనా మీటూ ఉద్యమం మంచి ఉద్దేశ్యంతో ప్రారంభం అయ్యింది, దాన్ని దుర్వినియోగం చేయడం వల్ల మొత్తం మహిళా లోకం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం అంతా గుర్తుంచుకోవాలి.