పుణ్యకాలాన్ని అంతా ఒదిలేశారు. దగ్గర చేసి సినిమాలు వదులుతున్నారు. కరెక్ట్ గా సంక్రాంతి ముహూర్తం చూసుకుని చాలా సినిమాలు వస్తున్నాయి. అయితే పండుగ తరువాత పరిస్థితి ఏంటి అన్నదే ఇపుడు టాలీవుడ్ లో జరుగుతున్న అతి పెద్ద చర్చ. ఒక వైపు ఒమిక్రాని రెక్కలు విప్పుకుంటోంది. రోజుకు లక్షల్లో కేసులు వచ్చి పడుతున్నాయి.
మరో వైపు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఆదేశాలను బట్టి రాష్ట్రాలు ఏ క్షణాన అయినా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఒమిక్రాన్ కేసులు ఒక మాదిరిగా నమోదు అవుతున్నాయి. అయితే కరోనా కేసులు వేలల్లో పరుగులు తీస్తున్నాయి. పండుగ అంటే విపరీతమైన రద్దీ ఉంటుంది, అన్ని వైపులా హడావుడి ఎక్కువ. దాంతో ఎటు చూసిన జన సందోహంతో పండుగ వేళ మరింతగా కరోనా వ్యాప్తి చెందుతుంది అంటున్నారు.
దాంతో పండుగ సందడికి పెద్దగా ఇబ్బంది లేకుండా చూసుకున్నా ఇలా సంక్రాంతి ముగియగానే అలా కరోనా ఆంక్షలను అమలులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. అంటే డైరెక్ట్ గా లాక్ డౌన్ అంతటి తీవ్ర నిర్ణయం తీసుకోకపోయినా నైట్ కర్ఫ్యూలు తప్పనిసరిగా అమలు చేస్తారని తెలుస్తోంది.
అదే విధంగా సినిమా హాళ్ళలో యాభై శాతం ఆక్యుపెన్సీని తిరిగి ప్రవేశపెడతారు అంటున్నారు. మరి ఇలా కనుక చూసుకుంటే రోజుకు మూడు ఆటలు, సగం హాలు మాత్రమే కలెక్షన్లతో కొత్త సినిమాలకు ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అన్నదే చర్చగా ఉంది.
ఈ సంక్రాంతికి బంగార్రాజు మూవీ వస్తోంది. ఇదే ఏకైక పెద్ద సినిమా. దీని ప్రీ రిలీజ్ బిజినెస్ 36 కోట్ల దాకా ఉంది. మరి ఇది రికవరీ కావాలీ అంటే ఒక్క సంక్రాంతి పండుగ రోజులే సరిపోవు. ఆ తరువాత కూడా కంటిన్యూస్ గా హౌస్ ఫుల్ కావాలి. నాలుగు ఆటలు ఉండాలి. ఇక ఏపీలో చూసుకుంటే ఇప్పటికే సినిమా టికెట్లను తగ్గించేశారు. దాంతో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఏపీలో బ్రేక్ ఈవెన్ కాలేకపోతోంది.
మరి ఈ టైమ్ లో పండుగ సినిమాల సంగతేంటి అన్న చర్చ అయితే వస్తోంది. పండుగ పోతూనే షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వాలు రెడీ అవుతున్న వేళ రిలీజ్ కాబోతున్న సినిమాల మీద మేకర్స్ యమ టెన్షన్ గా ఉన్నారని చెబుతున్నారు. ఒకవేళ కరోనా కండిషన్లు కనుక కాస్తా లేట్ అయితే మాత్రం ఈ సినిమాల కంటే లక్కీ వేరేవీ ఉండబోవేమో. చూడాలి మరి ఏం జరుగుతుందో.