బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య నుండి ఆయన అభిమానులు సినీ జనాలు బయట పడకుండానే మరో విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ మాదిరిగానే మరాఠీ నటుడు అయిన అశుతోష్ భక్రే ఆత్మహత్య చేసుకున్నారు. 32 ఏళ్ల అశుతోష్ పలు చిత్రాల్లో నటించడంతో పాటు మరాఠీ బుల్లి తెరపై తనదైన ముద్ర వేశారు. 2013లో భకార్ తో నటుడిగా అందరికి సుపరిచితం అయిన అశుతోష్ 2016లో నటి అయిన మయూరి ని వివాహం చేసుకున్నాడు.
మరాఠీ బుల్లి తెరపై వీరిద్దరు మంచి ప్రతిభను కనబర్చి అభిమానులను సొంతం చేసుకున్నారు. కలర్ ఫుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారని ఈ జంట గురించి సన్నిహితులు అభిమానులు అనుకునే వారు. కాని ఇలాంటి సమయంలో అశుతోష్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశం అవుతుంది. కొన్ని రోజుల క్రితం సుశాంత్ ఆత్మహత్య గురించి అశుతోష్ స్పందిస్తూ ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడో తొసుకోవాలి. ఆ విషయం తెలుసుకోలేకుంటే తప్పుగా మాట్లాడకూడదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ పోస్ట్ చేసిన కొన్ని రోజులకే అశుతోష్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అశుతోష్ ఆత్మహత్యకు కారణం ఏంటీ అనే విషయంలో క్లారిటీ లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు అశుతోష్ భార్య మయూరిని విచారించే అవకాశం ఉంది. ఆమె నోరు విప్పితే అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇలా సమస్యలకు భయపడి ఆత్మహత్య చేసుకోవడం అనేది పిరికి చర్య. కారణం ఏది అయినా పోరాడాలి. ఇలాంటి చర్యలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయనే ఆవేదన కొందరు వ్యక్తం చేస్తున్నారు.