దర్జాగా దొరలా షాపింగ్ చేసి ఆనక అడ్డంగా బుక్కయిన నటుడి స్టోరీ ఇది. భార్య కోసం బంగారం షాపింగ్ చేసి క్రెడిట్ కార్డ్ లో చెల్లింపులు చేస్తానని టోకరా వేసిన పెద్దాయనను పోలీసులు అరెస్టు చేయడం సంచలనమైంది. షాపింగ్ చేసి ఇదిగో పులి అంటే అదిగో మేక! టైపులో సదరు నటుడు ఆ షాపువాళ్లను తన చుట్టూ తిప్పుకున్నాడు. దీంతో ఓపిక నశించి సదరు నటుడిపై చీటింగ్ కేసును నమోదు చేశారు. ఈ డీల్ విలువ అక్షరాలా 25లక్షలు. అతడేం కొన్నాడంటే తన భార్య కోసం ఒక వజ్రపు ఉంగరం.. కొంత బంగారం.. వెండి కొన్నాడట. పూణేలోని పీఎన్ గాడ్గిల్ అనే బంగారం షాపు యజమాని అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్జా దొంగను అరెస్ట్ చేశారు.
ఇదంతా టీవీ ఆర్టిస్ట్ మిలింద్ దస్తానే.. ఆయన వైఫ్ చేసిన నిర్వాకం అని ముంబై టీవీ పరిశ్రమలో ఆ టాపిక్ వైరల్ గా మారింది. భార్యాభర్తలు ఇద్దరినీ మంగళవారం నాడు పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మిలింద్ మరాఠాలో గప్ప నటుడు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా `తుజ్యత్ జీవ్ రంగ్లా` అనే టీవీ సీరియల్ లో నటిస్తున్నాడు. 2018లోనే భార్యకోసం బంగారం షాపుకి వెళ్లి షాపింగ్ చేశాడు. అయితే తిరిగి ఆ డబ్బును మాత్రం చెల్లించలేకపోయాడు.
ఇంకా లోతుగా వివరాల్లోకి వెళితే.. వాస్తవానికి అతడు ఈ అప్పును ఎగ్గొట్టాలని అనుకోలేదు. ప్రస్తుతం ముంబైలోని అతడికి చెందిన ఓ విలువైన ప్రాపర్టీ అమ్మకానికి పెట్టాడట. అది అమ్మకం అయ్యి డబ్బు వస్తే 25 లక్షలు చెల్లించాలనుకుంటున్నానని షాపు యజమానిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. కానీ అతడు ఎంతకీ డబ్బు చెల్లించలేకపోవడంతో షాపు యజమాని పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 420, 406 ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. మిలింద్ దంపతులు రిమాండ్ లో ఉన్నారు.