మరో ప్రస్థానం ట్రైల‌ర్: సింగిల్ షాట్ ప్ర‌యోగం.. ఎమోష‌న్ యాక్ష‌న్ లవ్..!

Update: 2021-09-16 11:52 GMT
తనీష్ హీరోగా నటించిన చిత్రం `మరో ప్రస్థానం`. ముస్కాన్ సేథీ క‌థానాయిక‌. ఈ చిత్రానికి కొరియోగ్రాఫ‌ర్ జాని దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈనెల 24న సినిమా విడుద‌ల కానుంది. తాజాగా `మ‌రో ప్ర‌స్థానం` ట్రైల‌ర్ విడుద‌లైంది.

ట్రైల‌ర్ ఆద్యంతం యాక్ష‌న్ ఎమోష‌న్ హైలైట్ గా నిల‌వ‌గా త‌నీష్ సీరియ‌స్ ఇంటెన్స్ రోల్ ఆక‌ట్టుకుంది. ఇందులోనే క‌థానాయిక‌తో ప్రేమ‌క‌థ‌ను ఎలివేట్ చేశారు. ఒక డెన్ లో కంటిన్యూగా జ‌రిగిన క‌థ ఇది. స‌న్నివేశాల్ని కెమెరా రికార్డ్ చేయ‌డం క‌నిపిస్తోంది. రియల్ టైమ్ రీల్ టైమ్ ఒకటే క‌లిగి ఉన్న‌ సినిమా ఇది. సినిమాలో కథ ఎంత టైమ్ లో జరిగితే.. సరిగ్గా అదే టైమ్ కు షో పూర్త‌వుతుంది.

ఒక క్రిమినల్ ఎమోషనల్ జర్నీగా మహా ప్రస్థానం సినిమా ఉంటుంది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఒక మూడ్ లోకి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.  కథంతా నేచురల్ గా ఒక ఫ్లో లో కనిపించేలా షూట్ చేశాం. థియేటర్ లో ఆడియెన్స్ కు థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని ద‌ర్శ‌కుడు తెలిపారు.  సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్ జర్క్స్ రివైండ్ షాట్స్ లేకుండా స్ట్రైట్ స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని రూపొందించామ‌ని  దర్శకుడు జాని చెబుతున్నారు. రెగ్యులర్ గా వచ్చే సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓ ఎమోషనల్ కిల్లర్ జర్నీ అని చెబుతున్నారు. కథ కథనం సరికొత్తగా ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు తర్వాత సీన్ లో ఏం జరుగుతుందో అని ఉత్కంఠతో చూసేలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెర‌కెక్కించామ‌ని.. 2గంట‌ల స్టింగ్ ఆప‌రేష‌న్ లో ఏం జరిగింది? అన్న‌ది తెర‌పై చూపామ‌ని తెలిపారు.

వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా- కబీర్ దుహాన్ సింగ్- రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించ‌గా.. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్.. యానాల శివ.. పాటలు - ప్రణవం.

Full View
Tags:    

Similar News