టాలీవుడ్: పెళ్లి కళ వచ్చేసిందే బాలా!

Update: 2020-05-13 07:30 GMT
పెళ్లి మీద ఎన్నో జోకులు ప్రచారంలో ఉంటాయి. 'భద్రం బీ కేర్ఫుల్ బ్రదరో..' లాంటి పాత క్లాసిక్ పాటలు కూడా ఉంటాయి.. అయితే అదేంటో కానీ పెళ్లి చేసుకోవడం మాత్రం జనాలు మానరు. ఈమధ్య టాలీవుడ్ లో వరసగా మ్యారేజ్ న్యూసులు వస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కాస్తా పెళ్లి న్యూసులు చెప్తున్నారు.

యువ హీరో నిఖిల్ ఇప్పటికే తన వివాహం గురించి ప్రకటించాడు. నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఇప్పటికే పెళ్లి కావాల్సింది కానీ లాక్ డౌన్ నిబంధనల కారణంగా వాయిదా పడింది. ఇక మరో యువ హీరో నితిన్ కూడా పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. నితిన్ వివాహం కూడా లాక్ డౌన్ కారణంగానే వాయిదా వేసుకున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వైఘా రెడ్డిని రెండవ వివాహం చేసుకున్నారు.

ఇంతటితో ఈ శుభవార్తలు ఆగలేదు. కఠోర బ్రహ్మచారులుగా మిగిలిపోతారేమో అనే అనుమానాలు ఉన్న హీరోల మనసులను కూడా ఈ కఠిన లాక్ డౌన్ కదిలిస్తున్నట్టు ఉంది. నిన్న సాయంత్రం రానా దగ్గుబాటి తన ప్రేమికురాలిని పరిచయం చేశాడు. యస్ చెప్పిందని సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు. డిసెంబర్ లో రానా-మిహికాల వివాహం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.

ఈ వరస చూస్తుంటే టాలీవుడ్ లో ఉన్న మిగతా హీరోలు కూడా తమ బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పే లాగా ఉన్నారు. ఈ పెళ్లి వార్తలు గమనిస్తున్న కొందరు టాలీవుడ్ కు పెళ్లి కళ వచ్చేసిందని సరదాగా కామెంట్ చేస్తున్నారు.
Tags:    

Similar News