లవ్ బర్డ్స్ విఘ్నేష్ శివన్, నయనతార గత ఐదైళ్లుగా డేటింగ్ లో వుంటూ వచ్చారు. పెళ్లి వార్తలపై స్పందించకుండా సరైన టైమ్‌కోసం ఎదురుచూశారు. ఫైనల్ గా ఆ టైమ్ రానే వచ్చింది.
జూన్ 9న అనుకున్నట్టుగానే అంగరంగ వైభవంగా ఇరు కుటుంబాల ఫ్యామిలీ మెంబర్స్, కోలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. చెన్నై సమీపంలోని మహాబలేశ్వరంలో గల రిసార్ట్ లో వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే.
ఈ వివాహం వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం, విజయ్ సేతుపతి, కార్తి, ఏ.ఆర్, రెహమాన్, సూర్య, జ్యోతిక, అనిరుధ్, జయం రవి, అట్లీ కుమార్ తో పాటు చాలా మంది తమిళ, తెలుగు, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన టాప్ సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఇందులో కొంత మంది ఫొటోలు మాత్రమే బయటికి వచ్చాయి. చాలా వరకు సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు కానీ వీడియోలు కానీ బయటికి రాలేదు. కారణంగా ఈ పెళ్లి ఈవెంట్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కి భారీమొత్తానికి అమ్మేశారట.
ఈ పెళ్లి వీడియోని సినిమాటిక్ గా దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందించారట. ఈ బాధ్యతల్ని ముందుగానే విఘ్నేష్ శివన్ - నయనతార ఆయనకు అప్పగించినట్టుగా తెలిసింది. ఇదిలా వుంటే త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో నయన పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సడన్ గా నెట్ ఫ్లిక్స్ షాకిచ్చినట్టుగా తెలుస్తోంది. నయన్, విఘ్నేష్ లతో నెట్ ఫ్లిక్స్ చేసుకున్న ఒప్పందాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకున్నట్టుగా చెబుతున్నారు.
భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్న నెట్ ఫ్లిక్స్ చివరి నిమిషంలో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ఏంటని అంతా అవాక్కవుతున్నారు. అయితే ఇటీవల విఘ్నేష్ శివన్ వివాహం జరిగిన నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కొన్ని స్పెషల్ ఫొటోలని అభిమానులతో షేర్ చేశారట. ఇది నెట్ ఫ్లిక్స్ నిబంధనలకు విరుద్దమట. ఆ కారణంగానే నెట్ ఫ్లిక్స్ విఘ్నేష్ - నయన్ లతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవి ఎంత వరకు నిజమన్నది తెలియాల్సి వుంది. దీనిపై నెట్ ఫ్లిక్స్ వర్గాలు అధికారికంగా వెల్లడిస్తారా? లేక లైట్ తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే అని తమిళ మీడియా అంటోంది. ఇదిలా వుంటే పెళ్లి తరువాత తమిళనాడు సీఎంని డైరెక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్న విఘ్నేష్ శివన్ త్వరలో తల అజిత్ హీరోగా 'AK62' ని తెరకెక్కించే గోల్డెన్ ఛాన్స్ ని సొంతం చేసుకున్నాడు.