మారుతి మార్క్ సెటైర్.. కరోనా కరుణిస్తేనే 'పక్కా కమర్షియల్' రిలీజ్..!

Update: 2022-02-02 10:30 GMT
టాలీవుడ్ లో హిలేరియస్ కామెడీ చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు మారుతి. సినిమాలను పబ్లిసిటీ చేసుకోవడం విషయంలో కూడా ఎంటర్టైన్మెంట్ చిత్రాల స్పెషలిస్ట్ స్టైల్.. మిగతా ఫిలిం మేకర్స్ కంటే భిన్నమనే చెప్పాలి. సినిమా కంటెంట్ ని బట్టి అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి టీజర్స్ - ట్రైలర్ - పోస్టర్స్ డిజైనింగ్ వరకూ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కొత్తరకం ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు ''పక్కా కమర్షియల్'' సినిమాకు కూడా మారుతి తన మార్క్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మాచో స్టార్ గోపీచంద్ - బబ్లీ బ్యూటీ రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ - యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. SKN సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కోర్టు డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ అనౌన్స్ మెంట్ సందర్భంగా.. న్యాయస్థానంలో వాదోపవాదనలు జరుగుతున్నట్లు ఓ వీడియోని రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

అలానే గతేడాది టాలీవుడ్ లో మేకర్స్ అందరూ ఇబ్బడిముబ్బడిగా విడుదల తేదీలను ప్రకటిస్తున్న సమయంలో.. మారుతి తన సినిమా డిటైల్స్ ఏమీ లేకుండా రిలీజ్ డేట్ కోసం కుర్చీ మీద కర్చీఫ్ వేసినట్లు పోస్టర్ వదిలి సెటైర్ వేశారు. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో ఇండస్ట్రీలో రిలీజుల హడావిడి నడుస్తోంది. వచ్చే వారం మొదలుకొని సమ్మర్ సీజన్ ఎండింగ్ వరకూ అందరూ ఒకటికి రెండు డేట్స్ బ్లాక్ చేసి పెట్టుకుంటున్నారు. దీంతో మరోసారి మారుతి నుంచి మరో సెటైర్ వచ్చింది.

'పక్కా కమర్షియల్' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2022 మే 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన పోస్టర్ లో 'కరోనా కరుణిస్తేనే.. వస్తాం' అని పేర్కొన్నారు. వైరస్ ప్రభావం తగ్గకపోతే ఇప్పుడు డేట్స్ అనౌన్స్ చేస్తున్న సినిమాలు వస్తాయో లేదో చెప్పలేం. పరిస్థితులకు తగ్గట్టుగా మారుతి తన సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ వదిలిన ఈ సెటైరికల్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా, 'పక్కా కమర్షియల్' సినిమాలో గోపీచంద్ లాయర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ ను ఈరోజు (ఫిబ్రవరి 2) విడుదల చేయనున్నారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రవీందర్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
Tags:    

Similar News