మారుతి షో అంటూ ఆహా లో 3 రోజెస్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ముగ్గురు విభిన్న నేపథ్యాలు ఉన్న అమ్మాయిలు ఒకే ఆలోచనతో కలుస్తారు. వారి ఆలోచన ఒక్కటే తమ జీవితాన్ని తాము ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్చగా జీవించాలి. ఆ ఉద్దేశ్యంతోనే వారు చేసిన కొన్ని బోల్డ్ పనులు వారిని పీక్స్ కు తీసుకు వెళ్తాయి. దాంతో వారు రకరకాలుగా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. ఈ వెబ్ సిరీస్ కు మ్యాగీ దర్శకత్వం వహించాడు. ట్యాక్సీవాలా నిర్మాత అయిన ఎస్కేఎన్ నిర్మించాడు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే బోల్డ్ సన్నివేశాలు ఇందులో చాలానే ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ సమయంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ బోల్డ్ అంటే ఏంటీ అంటూ కొత్త అర్థంను ఇవ్వడం జరిగింది. ఆయన కెరీర్ ఆరంభం అయ్యింది కూడా బోల్డ్ సినిమా ఈరోజుల్లో తోనే అనే విషయం అందరికి తెల్సిందే. ఈరోజుల్లో మరియు బస్టాప్ సినిమా లు అప్పట్లో సెన్షేషన్ అయ్యాయి. ఒక వైపు సక్సెస్ టాక్ దక్కించుకుని మంచి వసూళ్లను దక్కించుకోవడంతో పాటు బూతు సినిమాలంటూ ఎంతో మంది వాటిని విమర్శించారు. ఆ రెండు సినిమాల వల్ల మారుతికి బూతు చిత్రాల దర్శకుడిగా పేరు పడిపోయింది. ఆ తర్వాత ఆయన పంథా మార్చుకుని మంచి ఫ్యామిలీ కథలను తెరకెక్కించి సక్సెస్ లను కూడా దక్కించుకున్నాడు.
మద్య మద్యలో అప్పట్లో నిర్మాతగా కాస్తబూతు రొమాంటిక్ సినిమాలను నిర్మించాడు. ఈమద్య అవి కూడా వదిలేశాడు. పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ గా మారాడు అనుకుంటే మళ్లీ ఈ వెబ్ సిరీస్ తో వచ్చాడు. ఈ వెబ్ సిరీస్ కు మారుతి దర్శకుడు.. నిర్మాతగా టైటిల్ కార్డ్ వేయలేదు. కాని కథ నుండి మొదలుకుని ఔట్ పుట్ వరకు అంతా కూడా ఆయన పర్యవేక్షణలో జరిగి ఉంటుంది. పెద్ద సినిమాలు చేస్తున్న తాను ఇలాంటి చిన్న వెబ్ సిరీస్ లు అది కాకుండా ఇలాంటి బోల్డ్ వెబ్ సిరీస్ లను చేయడం వల్ల ముందు ముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఆ ఉద్దేశ్యంతో టైటిల్ కార్డ్ లో కేవలం మారుతి షో అంటూ మాత్రమే వేయించాడు. ఆయన గురించి అవగాహణ ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా ఇది ఈరోజుల్లో ను గుర్తు చేసేలా ఉందంటూ మారుతికి కామెంట్ ఇస్తున్నారు. ఈరోజుల్లో తరహాలో మారుతి ఈ కొత్త షో ఇచ్చాడని కొందరు మీడియా వర్గాల వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మారుతి యూత్ కు కనెక్ట్ అయ్యే ఇలాంటి వెబ్ సిరీస్ లను మరిన్ని తీసుకు రావాలని ఓటీటీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.