ఈరోజుల్లో.. బస్ స్టాప్.. ప్రేమకథాచిత్రమ్.. ఈ సినిమాలన్నింటికీ మారుతి డైరక్టర్ అనేది ఎంత నిజమో.. అన్ని సినమాల్లోనూ హీరోని కాని.. సెకండ్ హీరోని కాని ఒక అమ్మాయి మోసం చేయడం అంతే నేరం. పైగా అమ్మాయిలందరూ అబ్బాయిలను కేవలం ఎ.టి.ఎం. మెషీన్ల టైపులో వాడేసుకుంటారని.. లేకపోతే అవసరాలు తీసుకుని హ్యాండిస్తారని.. మరింత బెటర్ అబ్బాయి దొరకగానే గుడ్ బాయ్ చెబుతారని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తుంటాడు మన దర్శకుడు. తను స్వయంగా కథ అందించిన 'రోజులు మారాయి' సినిమాలో కూడా సేమ్ పరిస్థితి.
అసలు అమ్మాయిలను పదే పదే ఇంత బ్యాడ్ గా ఎందుకు చూపిస్తున్నాడో మారుతి తెలియదు కాని.. ఈ సినిమా కథ చూశాక మాత్రం.. ఒక్కటినిపిస్తుంది. అయితే తనకు గాని.. లేదంటే తన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా కాని కొందరి అమ్మాయిల చేతిలో ఇలా బ్యాడ్ గా మాసపోయి ఉండాలి. అందుకేనేమో ఆ ప్రభావంతో మనోడు దాదాపు ప్రతీ కథలోనూ అదే చూపిస్తున్నాడు. కాకపోతే పెద్ద హీరోలైన నాని - వెంకటేష్ తదితరులతో సినిమాలు చేసేటప్పుడు మాత్రం అలాంటి చీటింగ్ కథలను పక్కనెడుతున్నాడు.
మారుతి అనుభవాలు ఎలా ఉన్నా కూడా.. మరీ దారుణంగా ప్రతీ సినిమాలోనూ ఇలా అమ్మాయిలను బ్యాడ్ లైట్ లో చూపించడం.. మాత్రం అమ్మాయిలకు ఏమాత్రం రుచించట్లేదు. ఈ సినిమాలకు వారు మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఆడియన్స్ కాకపోయినా.. టీజర్లలో చూస్తే తెలియట్లా లోపల ఏముంటుందో అంటున్నారు. దీనిపై మరి మారుతి ఎలా స్పందిస్తాడో చూడాలి.