పక్కా మాస్‌.. ఇదే టైటిల్‌

Update: 2020-12-27 15:30 GMT
ప్రతి రోజు పండుగే సినిమా తర్వాత గ్యాప్ ఇచ్చిన మారుతి తదుపరి సినిమాను ప్రకటించాలనుకుంటున్న సమయంలోనే కరోనా కారణంగా మొత్తం ప్లాన్‌ తలకిందులు అయ్యింది. కరోనా సమయంలో కొత్త సినిమాను మొదలు పెట్టలేక మారుతి కథలు రాసుకుంటూ కూర్చున్నాడు. ఎట్టకేలకు రవితేజతో మారుతి సినిమా కన్ఫర్మ్‌ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ మరియు మారుతిల కాంబో మూవీ వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌ లో పట్టాలెక్కబోతుంది. ఈ లోపు రవితేజ క్రాక్‌ ను విడుదల చేయడంతో పాటు ఖిలాడీ సినిమాను కూడా పూర్తి చేస్తాడని ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

రవితేజ అంటేనే మాస్‌.. ఇక మారుతి అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ ఇష్టపడే దర్శకుడు. వీరిద్దరి కాంబో అంటే ఖచ్చితంగా ఫ్యామిలీని ఎంటర్‌ టైన్‌ చేసే మాస్ సినిమా అన్నట్లుగా ఉంటుందని అనుకుంటున్నారు. కాని వీరి కాంబో మూవీ టైటిల్‌ మాత్రం సినిమాపై అభిప్రాయంను మార్చే విధంగా ఉంది. 'పక్కా మాస్‌' అనే టైటిల్‌ ను ఇప్పటికే మారుతి పక్కకు పెట్టాడట. రవితేజకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని.. తన రెగ్యులర్‌ స్టైల్‌ లో కాకుండా రవితేజ మార్క్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను చూపిస్తాను అంటూ మారుతి సన్నిహితుల వద్ద అంటున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెళ్లడించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.




Tags:    

Similar News